Bribe: లంచగొండి పోలీస్.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్‌!

అమీన్‌పూర్‌ సీఐగా పనిచేసి, ప్రస్తుతం సంగారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న సాయివెంకట కిశోర్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కేసు విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిగౌడ్‌ దగ్గర కోటిన్నర డిమాండ్ చేయగా.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Bribe: లంచగొండి పోలీస్.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్‌!
New Update

ACB: తెలంగాణలో మరో పోలీస్ ఆఫీసర్ అవినీతికి పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ భూమి కోనుగోలు విషయంలో కేసులో ఇరుక్కున్న బాధితుడి దగ్గర రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. హైదరాబాద్‌ మియాపూర్‌ మయూర్‌మార్గ్‌లో ఈ సంఘటన చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.కోటిన్నర డబ్బు లేదా రెండు ఫ్లాట్లు..
ఈ మేరకు సంగారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సాయివెంకట కిశోర్ గతంలో అమీన్‌పూర్‌ సీఐగా పనిచేశారు. అయితే అమీన్‌పూర్‌లో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిగౌడ్‌ను సంగారెడ్డి ఠాణాలో నమోదైన కేసు నుంచి తప్పించడానికి భారగా డిమాండ్ చేశాడు. రూ.కోటిన్నర డబ్బు, లేదంటే రెండు ఫ్లాట్లు రాసివ్వాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. అందులో భాగంగానే రవిగౌడ్‌ రెండు నెలల కిందట రూ.10 లక్షలు ఇచ్చారు. మిగిలిన రూ.1.40 కోట్లు తొందరగా ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండగానే కిశోర్‌కు సంగారెడ్డి సీసీఎస్‌కు బదిలీ అయ్యింది.

ఇది కూడా చదవండి: AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్‌ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి!

అయినా రవిగౌడ్‌ను బెదిరించడం ఆపలేదు కిశోర్. రవిగౌడ్‌పై తన స్నేహితులైన సీఐలతో ఒత్తిడి పెంచారు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం రూ.5 లక్షలు ఇస్తానని, మియాపూర్‌లోని మయూర్‌మార్గ్‌ వద్దకు రావాలని కిశోర్‌కు రవిగౌడ్‌తో ఫోన్‌ చేయించారు. అక్కడ డబ్బులను తీసుకుని, లెక్కిస్తుండగా కిశోర్‌ను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం కిశోర్ ను నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు.

#acb #bribe #aminpur-ex-ci-saivenkata-kishore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe