Maldives : ప్లీజ్‌ మాల్దీవులకు రండి.. భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి

టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తమ తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ అన్నారు. దయచేసి సహకరించాలని అభ్యర్థించారు.

Maldives : ప్లీజ్‌ మాల్దీవులకు రండి.. భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి
New Update

Indians : భారత్‌ మీద అనుచిత వ్యాఖ్యాలు చేసిన క్రమంలో మాల్దీవుల(Maldives) కు భారత్‌ తో సత్సంబంధాలు తెగిపోయాయి. ఆ ప్రభావం పర్యాటక రంగం(Tourism Sector) మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మాల్దీవుల పర్యటనకు వెళ్లే భారతీయులు వెళ్లడం మానేశారు. దీంతో అక్కడి పర్యాటక కేంద్రాలు బోసిపోతున్నాయి.

దీంతో తిరిగి భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి పర్యాటక కంపెనీలు ఇదివరకే పలు ప్రయత్నాలు చేయగా.. తాజాగా ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ స్వయంగా రంగంలోకి దిగారు. పర్యాటక రంగంపైనే ఎక్కువగా ఆధారపడే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని భారతీయ పర్యాటకులను ఇబ్రహిం ఫైసల్(Ibrahim Faisal) కోరారు. తమ దేశ ప్రజలు, ప్రభుత్వం భారతీయుల రాకపోకలకు ఘన స్వాగతం పలుకుతాయని ఫైసల్ అన్నారు.

టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తమ తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని అన్నారు. దయచేసి సహకరించాలని అభ్యర్థించారు. మాల్దీవులు, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటోందని అన్నారు. తాము భారత్‌తో ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు.

అసలేం జరిగిందంటే..ఈ ఏడాది జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ తీరంలోని లక్షద్వీప్ దీవుల సందర్శించి అక్కడి ఫొటోలు, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే లక్ష దీప్ బీచ్‌లకు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియోలపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. భారత్‌తో పాటు ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా భారతీయ పర్యాటకులు మాల్దీవులు వెళ్లడం మానేసిన విషయం తెలిసిందే.

Also read: ఏపీలో కాబోయే ఎంపీలు వీరే.. ఆర్టీవీ స్టడీ ఫలితాలు!

#pm-modi #maldives #indians #tourism-sector
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe