China Pneumonia:అంతుచిక్కని నిమోనియాతో మళ్ళీ భయపెడుతున్న చైనా.

చైనాలో మళ్ళీ మరో మహమ్మారి రాబోతోందా అంటే...అవుననే అనిపిస్తోంది. అంతుచిక్కని నిమోనియా అక్కడి చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజింగ్, లియనోనింగ్ లలో ఈ కొత్త వైరస్ తో వంద సంఖ్యల్లో పిల్లలు ఆసపత్రులపాలవుతున్నారు.

New Update
China Pneumonia:అంతుచిక్కని నిమోనియాతో మళ్ళీ భయపెడుతున్న చైనా.

కోవిడ్-19...ఇది ప్రారంభం అయింది చైనాలోనే. ఎక్కువ కాలం బాధపడింది కూడా ఆ దేశమే. చైనా నుంచి ప్రపంచం మొత్తం పాకి రెండేళ్ళపాటూ చావుకేకలు పెట్టించింది కరోనా. ఇప్పుడిప్పుడే చైనాతో సహా అన్ని దేశాలు మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నాయి. కానీ దాని ఛాయలు మాత్రం ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చైనాను మరో వైరస్ వణికిస్తోంది. ఇది కూడా ప్రాణాంతకం అవుతుంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆసపత్రులకు పరుగులు తీస్తున్నారు చైనీయులు. స్కూళ్ళకు వెళుతున్న చైనా పిల్లలు అంతుచిక్కని న్యూమోనియా బారిన పడుతున్నారు.

Also Read:బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శాస్వలో ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో ఇప్పడు చైనాలోని బీజింగ్, లినోనింగ్ ప్రాంతాల్లోని పిల్లలు వందల సంఖ్యలో ఆసపత్రుల్లో చేరుతున్నారు. జలుబు ఉన్న దగ్గు ఉండకపోవడం...అయినా దానికి సంబంధించిన లక్షణాలు శరీరంలో ఉండడం దీని లక్షణంగా కనిపిస్తోంది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది కూడా. దీంతో అక్కడి స్కూల్స్ ను తాత్కాలికంగా మూసేశారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్‌ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇలా ఒకేసారి వందల మంది పిల్లలు ఒకే రోగం బారిన పడడం ఆందోళనకర విషయమని అంటోంది ప్రొమెడ్ సంస్థ. అసలు ఇది ఎలా పుట్టుకొచ్చిందో కూడా తెలియడం లేదని చెప్పింది. పిల్లల వల్ల కొంత మంది టీచర్లు కూడా ఈ వైరస్ బారిన పడ్డారని చెబుతోంది. అయితే ఇది కరోనాలా మారుతుందా లేదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేమని అంటోంది. ప్రపంచదేశాలు అన్నీ ఎప్పుడో లాక్ డౌన్ లను ఎత్తేసింది. కరోనా ఆంక్షలను సడలించేశాయి. కానీ చైనా మాత్రం కరోనా తర్వాత కూడా రకరకాల వైరస్ బారిన పడటంతో ఈ ఏడాది ప్రారంభం వరకూ కరోనా నింబధనలను అమలు చేసింది. అంతకట్టుదిటంటగా ఉన్నా కూడా చైనాను అంటువ్యాధులు వదిలిపెట్టడం లేదు. కరోనా తర్వాత చాలా వైరస్ లు అక్కడ వచ్చాయి.

ఈ కొత్త న్యుమోనియాను చైనాలో అక్టోబర్ లోనే డాక్టర్లు కనుగొన్నట్లు చెబుతున్నారు. పాత వైరస్ లో పోలిస్తే ఈ కొత్త న్యుమోనియాలో మిక్స్‌డ్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు డాక్టర్ ఎరిక్ డింగ్. ఇది కొత్త వైరస్సా లేక యాంటీ బయోటిక్స్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియానా అన్నది తెలియాల్సి ఉందని చెబుతున్నారు. దీనిని ప్రస్తుతం మైకో ప్లాస్మా న్యూమోనియా...అకా వాకింగ్ న్యుమోనియా అంటున్నారు. అయితే అలా అని నిర్ధారించలేము అని...ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిమోనియా అవుట్ బ్రేకింగ్ చాలా ఎక్కువ ఉందని...వాకింగ్ నిమోనియాకు అంత ఎఫెక్ట్ ఉండదని చెబుతున్నారు. దీనికి కోవిడ్ తరహా లక్షణాలే ఉన్నాయని అందుకే త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. బీజింగ్, లినోనింగ్ లు 800 కి.మీ దూరంలో ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడకు ఇంత తొందరగా వ్యాపించింది అంటే...ఇది మరింతగా వ్యప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్ డింగ్. ఇన్ఫ్లుయెన్జా వైరాలిజిస్టులు పాండమిక్ క్లాక్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని నతతో అన్నారని చెబుతున్నారు డింగ్. ప్రస్తుతం నిమోనియా బారిన పడుతున్న చిన్నారులు ఇంట్రీవీనస్ డ్రిప్ సహాయంతో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు