USA : 22 ఏళ్ళ క్రితం మిస్సింగ్.. ఇంకా చెక్కు చెదరని మృతదేహం

22 ఏళ్ళు క్రితం మిస్సయిన ఓ పర్వతారోహకుడి ఆచూకీ ఇప్పుడు లభించింది. అతను చనిపోయిన అతని మృతదేహం మాత్రం ఏ మాత్రం పాడవకుండా లభించింది. వేసుకున్న డ్రెస్ దగ్గరినుంచి.. ఆ వ్యక్తి శరీర భాగాలు అచ్చం అలానే ఉన్నాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..

New Update
USA : 22 ఏళ్ళ క్రితం మిస్సింగ్.. ఇంకా చెక్కు చెదరని మృతదేహం

American Mountaineer : రీసెంట్‌గా అమెరికా (America) కు చెందిన ఓ పర్వతారోహకుడి మృతదేహం పెరూ దేశంలోని హుస్కరన్ పర్వతం మీద లభించింది. అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్ (William Stampfl) అనే 59 ఏళ్ల వ్యక్తి పర్వతారోహణ కోసం 2002లో పెరూ (Peru) లోని హుస్కరన్ పర్వతం వద్దకు చేరుకున్నాడు. 6700 మీటర్లు అంటే 22 వేల అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించిన విలియం స్టాంప్‌ఫ్ల్.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తోటి పర్వతారోహకులు, పోలీసులు ఎంత గాలించినా విలియం ఆచూకీ దొరకలేదు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు వెతికి వెతికి అలిసిపోయారు. ఇక ఎప్పటికీ దొరకదని నిర్ణయించుకుని వదిలేశారు.

ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత హుస్కరన్ పర్వతం (Huascaran Mountain) మీద వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా విలియం మృతదేహం లభ్యం అయింది. ఆ కొండ మీద పేరుకున్న మంచు కరగడంతో అతని మృతదేహం బయటపడిందని పోలీసులు చెప్పారు. అయితే దీన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే 22 ఏళ్ళ తరువాత కూడా విలియం బట్టలు కానీ, బాడీ కానీ చెక్కు చెదరలేదు. అతని శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అలాగే ఉంది. విలియం వేసుకున్న బట్టలు, షూ, పాస్‌పోర్టు కూడా అలాగే ఉంది. ఈ క్రమంలోనే పాస్‌పోర్టులో ఉన్న వివరాల ఆధారంగా విలియం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

పెరూలో ఉన్న పర్వతాలను అధిరోహించేందుకు దేశ, విదేశాల నుంచి పర్వతారోహకులు వెళ్తూ ఉంటారు. ఈశాన్య పెరూలో హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను ఎక్కువమంది అధిరోహిస్తారు. అయితే ఈ క్రమంలో చాలా మంది మృత్యువాతను కూడా పడుతుంటారు. అక్కడ చాలా అధికంగా మంచు ఉండడం ఒక కారణం. పర్వతం ఎక్కే క్రమంలో అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోవడం, అదుపు తప్పి పడిపోవడం, మంచులో కూరుకుపోవడంలాంటి సంఘటనల వల్ల చాలా మంది చనిపోతుంటారు. రీసెంట్‌గా
ఇజ్రాయెల్‌, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ.. అక్కడి వాతావరణం తట్టుకోలేక మృత్యువాత పడ్డారు.

Also Read:USA: వాషింగ్టన్‌లో మొదలైన నాటో సమావేశాలు..జో బైడెన్‌పై పెరుగుతున్న అసమ్మతి

Advertisment
తాజా కథనాలు