Russia: రష్యా సరిహద్దులో అమెరికా బాంబర్‌ విమానాలు.. ఉక్రెయిన్‌ కోసమేనంటూ!

అమెరికా బాంబర్‌ విమానాలు తమ దేశ సరిహద్దుల్లో చక్కర్లు కొట్టినట్లు రష్యా ఆరోపించింది. అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్‌ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని పేర్కొంది. వాటిని ఫైటర్‌ జెట్లతో అడ్డుకున్నట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది.

New Update
Russia: రష్యా సరిహద్దులో అమెరికా బాంబర్‌ విమానాలు.. ఉక్రెయిన్‌ కోసమేనంటూ!

America: అమెరికాకు చెందిన బాంబర్‌ విమానాలు తమ దేశ సరిహద్దుల్లోకి వచ్చినట్లు రష్యా సైన్యం తెలిపింది. ఆర్కిటిక్‌లోని బారెంట్స్‌ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకోగా తమ యుద్ధ విమానాలతో వాటిని అడ్డుకున్నట్లు మాస్కో బలగాలు వెల్లడించాయి. ఈ మేరకు సరిహద్దుకు వచ్చిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్‌ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణశాఖ తెలిపింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్‌ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని పేర్కొంది.

సాధారణ ప్రక్రియేనంటున్న అమెరికా..
అయితే దీనిపై స్పందించిన అమెరికా.. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని చెప్పింది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని పేర్కొంది. అయితే రష్యా మాత్రం.. ఉక్రెయిన్‌కు సహాయపడేందుకు అమెరికా డ్రోన్‌ విమానాలను ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఇలాంటి చర్యలు నాటో, రష్యా మధ్య ఘర్షణను మరింత పెంచుతున్నాయని హెచ్చరించింది. నల్ల సముద్రం మీదుగా డ్రోన్‌ విమానాలు దూసుకురావడం ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దారితీసిస్తుందని ఇటీవల హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు