America Tour : అమ్మో అంతమందా? భారతీయుల్లో అమెరికా మోజు తగ్గడం లేదుగా!

ఒక పక్క వీసా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అమెరికా వెళ్లే భారతీయుల సమాఖ్య తగ్గడంలేదు. 2023లో దాయపు 1.7 మిలియన్ల మంది అమెరికా వెళ్లారు. 2 మిలియన్ల మంది భారతీయులు తమ దేశానికి వచ్చేలా చేయాలనేది అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వీసాల సమస్యలను తొలగిస్తోంది. 

America Tour : అమ్మో అంతమందా? భారతీయుల్లో అమెరికా మోజు తగ్గడం లేదుగా!
New Update

America : వీసా(Visa) లు రావడంలో జాప్యం జరుగుతున్నప్పటికీ అమెరికా(America) కు వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. గత ఏడాది అంటే 2023లో దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు అమెరికాకు వచ్చారని, ఇది 2019తో పోలిస్తే 20% ఎక్కువ అని బ్రాండ్ USA చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్టాసీ మెయిల్‌మాన్ తెలిపారు. 2027 నాటికి ఈ సంఖ్యను 2 మిలియన్లకు పెంచాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని కూడా ఆయన చెప్పారు. ఇందుకోసం కొత్త వీసాలకు సంబంధించిన సవాళ్లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. 

వీసా అపాయింట్‌మెంట్‌లలో జాప్యం భారతీయ సందర్శకులకు ఇబ్బంది అని స్టాసీ మెయిల్‌మాన్ చెప్పారు.  అయితే దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు.  దీని కింద 2023లో భారత్ నుంచి అమెరికా(America Tour) వెళ్లేందుకు 1.2 మిలియన్ కొత్త వీసాలు జారీ అయ్యాయి. దీంతో పాటు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర చర్యలు కూడా చేపట్టారు. భారతీయ ప్రయాణీకుల వీసా గడువు ముగిసినట్లయితే, వారి కోసం రెన్యూవల్  ప్రక్రియ చాలా సులభంగా ఉండేలా చేశారు. గడువు వ్యవధి దాదాపు నాలుగేళ్లు ఉంటే, వారు వ్యక్తిగత అపాయింట్‌మెంట్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు.

Also Read: అయోధ్య రామమందిరంలో ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం 

అమెరికాను సందర్శించే భారతీయ ప్రయాణికుల నుంచి బ్రాండ్ USA కి (America Tour) మంచి స్పందన లభిస్తోందని  స్టాసీ మెయిల్‌మాన్  చెప్పారు. యుఎస్‌ని సందర్శించే భారతీయులకు న్యూయార్క్, కాలిఫోర్నియా -  ఫ్లోరిడా ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. పర్యాటకుల పరంగా అమెరికాకు భారతదేశం ఐదవ అంతర్జాతీయ మార్కెట్. భారతదేశంలో మధ్యతరగతి శ్రేయస్సు పెరుగుతున్నందున, ఈ మార్కెట్ కు పెద్ద అవకాశం ఉంది.

US కు (America Tour) భారతీయ సందర్శకుల సంఖ్యను పెంచడానికి బ్రాండ్ USA టాటా CLiQ లగ్జరీతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది ప్రయాణ ప్రపంచంలో టాటా CLiQ మొదటి అడుగు. బ్రాండ్ USA చెబుతున్న దాని ప్రకారం, ఈ ఒప్పందం లో భాగంగా, అధిక నికర విలువ కలిగిన భారతీయ TataCLiQ వినియోగదారులకు డిస్కౌంట్లు ఇస్టారు. USAలో అందుబాటులో ఉన్న 'ప్రత్యేకమైన' లగ్జరీ ప్రయాణ సౌకర్యాల ప్రయోజనం కూడా వారికి అందిస్తారు. 

Watch this interesting Video :

#usa #america #tatacliq #visa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe