Hyderabad: ఈ రోజుల్లో నిజాయితీ, నిబద్ధత పేరుకే గాని ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదు. కానీ అక్కడక్కడ కొంతమంది తమ నిజాయితీని చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ మేరకు హైదరబాద్ ఎర్రగడ్డ ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని రక్షించిన 108 ఆంబులెన్స్ (Ambulance) సిబ్బంది.. అతని దగ్గరున్న భారీ మొత్తం నగదును బాధితుడికి అందించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులున్నారంటే నిజంగా గ్రేట్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు.
ఎర్రగడ్డ బ్రిడ్జి..
పూర్తి విరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ బ్రిడ్జి మీద బైకు అదుపుతప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు అమీర్‌పేట్ 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన తిరుపతయ్య అనే వ్యక్తికి చికిత్స అందిస్తూ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తి స్పృహ కోల్పోయిన తిరుపతయ్య దగ్గర రూ:68,500/- నగదు ఉన్నట్లు గుర్తించిన ఆంబులెన్స్ సిబ్బంది.. డబ్బుతోపాటు తిరుపతయ్య మొబైల్, బైక్ తాళం అతని బంధువులకు నిజాయితీగా అప్పగించారు.
ఇది కూడా చదవండి : Mount Everest : వయసుకు మించిన సాహసం.. ఎవరెస్ట్ ఎక్కేసిన నాలుగేళ్ల చిన్నారి
స్థానికులు హర్షం..
అపదలో ఉన్న వ్యక్తిని రక్షించడంతోపాటు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా మానవత్వం చాటుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వృత్తిలో ఉండటమే కాకుండా.. ఎంతో నిజాయితీగా నగదును అప్పగించిన 108 సిబ్బంది ఎస్.వెంకటేష్, వెంకటరమణను పలువురు అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతుండగా జనాల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వెంకటేష్, వెంటకరమణల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.