Ambulance: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపుర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ పేషెంట్ భార్యపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంతేకాదు బాధిత మహిళా డ్రైవర్ దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నించగా అంబులెన్స్ లో ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ తొలగించాడు దుర్మార్గుడు. దీంతో పేషెంట్ చనిపోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మార్గమధ్యలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ..
సిద్ధార్థ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత గతవారం ఘాజిపుర్‌లోని ఆరావాళి మార్గ్ ఆసుపత్రిలో భర్తను చేర్పించింది. అక్కడ వైద్య ఖర్చులు కట్టలేక భర్తను తన సోదరుడితో కలిసి ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ మాట్లాడుకుని బయలుదేరింది. అయితే డ్రైవర్ ఆమెను ముందుసీట్లో కూర్చోవాలని అడిగాడు. మహిళలుంటే రాత్రిపూట పోలీసులు ఆపరని నమ్మించాడు. మార్గమధ్యలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె అభ్యంతరం చెప్పడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం గమనించిన ఆమె సోదరుడు గట్టిగా కేకలు వేయడంతో చవానీ పోలీస్ స్టేషన్ దగ్గరలో వారిని దించేసి పారిపోయారు. ఆక్సిజన్ తొలగించడంతో భర్త చనిపోయాడు. వారి దగ్గరున్న రూ.10వేల నగదు, బంగారం లాక్కొని పారిపోయిన్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏడీసీపీ జితేంద్ర దూబే తెలిపారు.