Ambati Rayudu: అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా..అంబటి రాయుడి వివరణ!

ప్రొఫెషనల్‌ ఆటకు , రాజకీయాలకు సంబంధం ఉండకూడదు కాబట్టే నేను వైసీపీకి గుడ్‌ బై చెప్పినట్లు క్రికెటర్‌ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీని విడడంతో వైసీపీ మీద ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

New Update
Ambati Rayudu: అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా..అంబటి రాయుడి వివరణ!

Ambati Rayudu: వైసీపీ (YCP) లో చేరిన వారం రోజులకే పార్టీ నుంచి బయటకు వెళ్లారు క్రికెటర్‌(Cricketer) అంబటి రాయుడు(Ambati Rayudu). ఈ క్రమంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత అంబటి ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

సంబంధం ఉండకూడదనే..

ఆ ట్వీట్‌ లో '' నేను అంబటి రాయుడిని..జనవరి 20 నుంచి దుబాయ్‌ వేదికగా జరిగే ఐఎల్టీ 20 లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.ప్రొఫెషనల్‌ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు'' అని పేర్కొన్నారు. అంబటి రాయుడు వైసీపీలో గత వారం చేరగా..నిన్న పార్టీకి గుడ్‌ బై చెప్పి బయటకు వచ్చేశారు. వైసీపీ విడిచిపెడుతున్నానని, కొన్నాళ్లు పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అతి త్వరలోనే తన తరువాత ప్లానింగ్ ఏంటనేది తెలియజేస్తానని రాయుడు ట్వీట్‌ చేశారు. పార్టీలో చేరిన వారం రోజుల్లోనే రాయుడు పార్టీని విడటం గురించి టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీలో కనీసం వారం రోజుల పాటు కూడా పార్టీలో మనుగడ కొనసాగించలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

పది రోజులకే..

దీనికి కారణం ఆ పార్టీలోని ప్రతికూల పరిస్థితులే అంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. కానీ అంటి ట్వీట్‌ ఆ విమర్శల పై క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

రాజకీయాలతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు.

అంతలోనే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ట్వీట్‌ చేసి రాయుడు అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ట్వీట్‌ ద్వారా తాను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చాడు.

Also read: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్

Advertisment
తాజా కథనాలు