/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ambati-jpg.webp)
Ambati Rambabu: టీడీపీ-జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ఏకపక్షంగా ప్రకటించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని అన్నారు. సర్దుబాటుకు ముందే అభ్యర్ధుల్ని ప్రకటించడం సరికాదని సూచించారు. టీడీపీకి పోటీగా రెండు స్థానాలను ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని డిక్లేర్ చేశారు.
Also Read: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..!
అయితే, జనసేనాని వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వాడే "బాబు" అని తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్! అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
పొత్తు ధర్మమే కాదు
ఏ ధర్మము పాటించని వాడే "బాబు"
తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 26, 2024
ఇదిలా ఉండగా.. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు, వపన్ కళ్యాణ్. ఎమ్మెల్యేల సీట్ల కోసం ఇరు పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. అయితే, ఎవరికి సర్ది చెప్పలేక తంటాలు పడుతున్నారు పార్టీ అధినేతలు. పవన్ కళ్యాణ్ మాత్రం..ఒక మాట అటున్నా..ఇటున్నా కలిసే వెళ్తున్నాం అని తేల్చిచెబుతున్నారు.