Nita Ambani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ వెడ్డింగైన ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, ప్రముఖులు, సినీ తారలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం ధరించిన ప్రతీ వెడ్డింగ్ అవుట్ ఫిట్ ఎంతో ప్రత్యేకంగా, రాయల్ గా కనిపించింది.
అయితే భారత్ ఈవెంట్ లో నీతా అంబానీ ధరించిన లెహంగా నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రాయల్ లెహంగాను డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. ఈ అద్భుతమైన డిజైనర్ లెహంగాకు సంబంధించిన ప్రత్యేక వివరాలను డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారతీయ హస్తకళా ప్రతిభను ప్రతిభింబించేలా ఈ లెహంగాను రూపొందించారు. ఈ పీచు రంగు ఘాగ్రా ప్యూర్ సిల్క్ తో తయారు చేయబడింది. దాని పై నెటెడ్ బ్లౌజ్ సాదా బంగారంతో పాటు వెండి జర్దోజీ వర్క్‌తో ఎంతో అందంగా డిజైన్ చేయబడింది. ఈ అద్భుతమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ లెహంగాను తయారు చేయడానికి 40 రోజులు పట్టిందట. నీతా అంబానీ ఈ అందమైన పీచు రంగు ఘాగ్రాతో భారీ వన్ పీస్ నెక్లెస్, మాంగ్టికా, చెవిపోగులు ధరించి రాయల్ గా కనిపించారు. అంతే కాదు ఈ బ్లౌజ్ వెనుక భాగంలో నీతా అంబానీ తన కుటుంబ సభ్యుల పేర్లను అందంగా క్రాఫ్ట్ చేయించారు. నీతా అంబానీ ధరించిన ఈ రాయల్ లెహంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Image Credits: Instagram
Also Read: Hasseen Dillruba: నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ 'దిల్రుబా'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..? - Rtvlive.com