/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-14T180326.349.jpg)
Radhika Merchant : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) - నీతా అంబానీ (Nita Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) - రాధికా (Radhika Merchant) వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం జులై 13న ఈ జంట 'శుభ ఆశీర్వాద్' వేడుకను ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం.
ఈ వేడుకలో వధువు రాధికా అందమైన వస్త్రాలంకారణలో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అబు జానీ సందీప్ ఖోస్లా లెహంగాను పవిత్రమైన ఆశీర్వాద వేడుకకు ధరించారు.
భారతీయ కళాకారిణి, శిల్పి జయశ్రీ బర్మన్, రియా కపూర్ రాధికా దుస్తులు డిజైన్ చేయడంలో సహకరించారు.
రాధికా ప్రత్యేకమైన రోజున ఆమె ధరించిన లెహంగా ఆకర్షణీయంగా ఉండడానికి .. ఇటాలియన్ కాన్వాస్‌పై(ప్లైన్ ఫాబ్రిక్ పై) లెహంగాలో కనిపించే 12 ప్యానెల్‌లను జయశ్రీ చేతితో చిత్రించింది. లెహంగా పై నిజమైన బంగారు జర్దోజీని చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.
రాధికా ధరించిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను పూర్తిగా సిల్క్‌తో రూపొందించారు.
సంతోషకరమైన జంటను సూచించే మానవ బొమ్మలు, దేవి రూపాలను రాధికా లెహంగా పై అందంగా డిజైన్ చేశారు. రాధికా లెహంగా పై కనిపించే ఏనుగు బొమ్మలు, పక్షులు జంతువుల పట్ల అనంత్‌కు ఉన్న అభిమానాన్ని వర్ణిస్తోంది.
ఈ జీవ హస్తకళ సమిష్టి కొత్త ప్రారంభాల ఆనందాన్ని, ప్రేమతో జీవించే జీవితాన్ని తెలియజేస్తుంది.
అందమైన హస్తకళలతో రూపొందిన వస్త్రాలంకారణలో రాధికా ఎంతో అందంగా కనిపించింది. Image Credits: rheakapoor, jayasriburman/Instagram