Ambani Wedding: అంబానీ పెళ్ళిలో స్పెషల్ 'tags' తో తళుక్కుమన్న తారాలు.. అసలేంటి ఈ ట్యాగ్స్?

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం ఈరోజు రాత్రి 9.30 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు ప్రత్యేక 'ట్యాగ్స్'తో అందరి దృష్టిని ఆకర్షించారు. వారు ధరించిన అవుట్ ఫిట్స్ వెనకాల 'అనంత్స్ బ్రిగేడ్' అనే ట్యాగ్ తో సందడి చేశారు.

New Update
Ambani Wedding: అంబానీ పెళ్ళిలో స్పెషల్ 'tags' తో తళుక్కుమన్న తారాలు.. అసలేంటి ఈ ట్యాగ్స్?

Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు అంబరానంటుతున్నాయి. చిన్న కుమారుడు అనంత్, రాధిక మర్చంట్ వివాహం ఈరోజు రాత్రి 9.30 నిమిషాలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ తారలు వివాహ వేదికకు చేరుకున్నారు.

'అనంత్స్ బ్రిగేడ్'

అయితే అనంత్ అంబానీ- రాధికా వివాహ వేడుకల్లో బాలీవుడ్ తారలు ప్రత్యేక 'ట్యాగ్స్'తో అందరి దృష్టిని ఆకర్షించారు. వారు ధరించిన అవుట్ ఫైట్స్ వెనకాల స్పెషల్ ట్యాగ్స్ తో పెళ్ళిలో సందడి చేశారు. అనన్య పాండే తన అవుట్ ఫిట్ వెనకాల 'అనంత్స్ బ్రిగేడ్' అనే ట్యాగ్ తో వచ్చింది. అంటే తాము వరుడు అనంత్ టీమ్ అన్నట్లుగా రాసి ఉంది.

'మేరే యార్ కి షాదీ'

అర్జున్ కపూర్ 'మేరే యార్ కి షాదీ' అనే ట్యాగ్‌తో వచ్చారు. అంటే 'నా స్నేహితుడి పెళ్లి అని అర్థం'. మిలన్ జాఫ్రీ కూడా స్పెషల్ ట్యాగ్ తో మెరిసాడు. కుర్తా వెనుక భాగంలో 'DDC' అని రాసి ఉంది. అంటే మిల్క్ వాష్డ్ బాయ్స్ అని రాసి ఉంది. ఇలా రకరకాల ట్యాగ్స్ వరుడు, వధువు టీమ్స్ గా సందడి చేశారు. అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యేందుకు సారా అలీ ఖాన్ తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి వచ్చారు. సారా పింక్ లెహంగా-చోలీలో అద్భుతంగా కనిపించింది. ఇబ్రహీం నలుపు రంగు బంద్‌గాలా దుస్తులలో కనిపించారు.

Also Read: Ambani Wedding: కళ్ళు జిగేలుమనిపించేలా అంబానీ పెళ్లి ఊరేగింపు.. వీడియో వైరల్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు