Anant Ambani - Radhika Merchant Haldi Celebrations : రిలయన్స్ (Reliance) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం చిన్న కుమారుడు అనంత్ - రాధికా పెళ్లి సంబరాల్లో బిజీగా ఉంది. అనంత్ - రాధికా పెళ్లి వేడుకలు నిరుపేదల సామూహిక వివాహాలతో మొదలయ్యాయి. ముందుగా మామేరు వేడుక, ఆ తర్వాత గ్రహపూజ, సంగీత్ వేడుక జరిగాయి.
అనంత్- రాధికా హల్దీలో బాలీవుడ్ తారలు
ఇక నిన్న సాయంత్రం అనంత్-రాధికా (Anant - Radhika) హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ జంట హల్దీ వేడుకలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు (Bollywood Celebrities) పాల్గొన్నారు. జాన్వీ కపూర్, బోనీ కపూర్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే, రణ్ వీర్ సింగ్, సారా అలీఖాన్, మానుషీ చిల్లర్, డైరెక్టర్ అట్లీ సందడి చేశారు. హల్దీ వేడుకల్లో సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ పసుపు కుర్తా, నలుపు పైజామా ధరించి స్టైలిష్ దేశీ లుక్ లో కనిపించారు. జాన్వీ అందమైన ఎల్లో శారీలో ఎలిగెంట్ గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతున్నాయి.
జులై 12న వివాహం
అనంత్- రాధికా మర్చంట్ పెళ్ళికి ఇంకా 3 రోజుల సమయం ఉంది. జులై 12న వీరిద్దరూ ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు. అనంత్- రాధికా వివాహ వేడుకలు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనున్నాయి. జూలై 14న రిసెప్షన్తో ఈ వివాహ వేడుకలు ముగుస్తాయి. బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీలు, దేశంలోని ప్రముఖులు అనంత్- రాధికా వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
అనంత్- రాధికా హల్దీలో బాలీవుడ్ తారలు
Also Read: Mr. Bachchan: రవితేజ - భాగ్య శ్రీ డ్యూయెట్.. ట్యూన్ అదిరిపోయిందిగా..! - Rtvlive.com