Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జులై 3న దంపతుల మామేరు వేడుక జరిగింది. ముంబైలోని యాంటిలియా రెసిడెన్స్‌లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకల్లో వధువు రాధికా మర్చంట్ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ అందరి దృష్టిని ఆకర్షించింది. రాధిక మర్చంట్ లుక్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
'మామేరు వేడుక'
గుజరాతీ వివాహ సాంప్రదాయాల్లో మామేరు వేడుక ఒకటి. ఈ వేడుక పెళ్లికి ముందు జరుగుతుంది. ఇందులో వధువు తల్లి కుటుంబం(మేనమామ) జంటకు బహుమతులు, ప్రసాదాలను అందజేస్తుంది. మామేరు అనగా గుజరాతీలో మేనమామ అని అర్థం. మేనమామ ఇచ్చిన బహుమతులను వధువు స్వీకరించడమే మామేరు వేడుక.
అమ్మ నగలు ధరించిన రాధికా
ఈ వేడుకలో రాధికా మర్చంట్ కొత్త ఆభరణాలను ధరించిలేదు. సెంటిమెంట్ గా ఆమె తల్లి శైలా మర్చంట్ ఆభరణాలను ధరించింది. ఈ యాంటిగ్ జ్వేలరీతో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన హెవీ ఎంబ్రాయిడర్డ్ లెహంగా లుక్ మరింత హైలెట్ చేసింది. రాధికా హెవీ బందినీ లెహంగా ధరించింది. ఇది క్లాసిక్ గోల్డ్ వైర్ జర్డోజీ ఎంబ్రాయిడరీ వర్క్ తో అందంగా కనిపిస్తోంది. అంతే కాదు ఇందులో దుర్గా మా పద్యం లెహంగా సరిహద్దులో ఎంబ్రాయిడరీ చేయబడింది. ఈ ఘాగ్రా తయారీకి 35 మీటర్ల బంధేజ్‌ను ఉపయోగించారు. దీని పై పాతకాలపు కోటు లాంటి బ్లౌజ్ ను డిజైన్ చేశారు. బంగారు అలంకరణలతో అద్భుతమైన నారింజ, గులాబీ రంగు లెహంగాలో రాధికా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.