Expensive Wedding in Bollywood: పెళ్లికి లక్షలు, కోట్లు ఖర్చు చేసేవారు మన కళ్లముందే తిరుగుతుంటారు. వామ్మో ఇంత ఖర్చు పెట్టి పెళ్లా అని కొంతమంది ఆశ్చర్యపోతారు.. మరికొంతమంది వీడికి బాగా ఎక్కువుందిలే..అందుకే ఇంత హడావుడి అనుకుంటారు. మరికొందరు డబ్బులు వేస్ట్ చేసి పెళ్లి చేస్తున్నాడురా అనుకుంటారు. ఇదంతా సామాన్య ప్రజల మధ్య జరిగే సంభాషణ. సెలబ్రేటిల సర్కిల్ మాత్రం వేరేలా మాట్లాడుకుంటుంది. ఏ ప్లేస్‌లో పెళ్లి.. ఎంతమందిని పిలిచారు? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యింది? ఎన్ని వందల రకాల వంటలు వండారు లాంటి ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం అంబానీ కొడుకు ప్రి వెడ్డింగ్ గురించే ప్రజలు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రి వెడ్డింగే ఇంత భారీగా చేస్తున్నారేంటని నొరేళ్లబెడుతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన పెళ్లి ఎవరిదో ఇవాళ మనం తెలుసుకుందాం!
50 మందికి రూ.100కోట్లు ఖర్చు:
బాలీవుడ్‌లో జరిగే పెళ్లి వేడుకలు అభిమానుల ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అందులోనూ ఇద్దరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్‌కు మరింత పండగే. ముఖ్యంగా పెళ్లి ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అటు వివాహ ఖర్చుపైనా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ. 100 కోట్లతో అత్యంత ఖరీదైన బాలీవుడ్ పెళ్లి అనుష్క శర్మది. విరాట్-అనుష్క భారత్‌లోని ఫేమస్ కపుల్స్‌లో ఒకరు. ఈ జోడికి 2017లో వివాహమైంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులలో 50 మందిని మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. అయితే ఈ 50మంది అతిథులకే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేశారు.
ఇటలీలో పెళ్లి:
కొన్ని నివేదికల ప్రకారం అనుష్క శర్మ ధరించిన సబ్యసాచి వెడ్డింగ్ లెహంగా ఒక్కటే రూ. 30 లక్షలు. ఇక ఈ జంట పెళ్లి ఇటలీలో జరిగింది. కోహ్లి, అనుష్క శర్మ బోర్గో ఫినోచిటో అనే 800 ఏళ్ల నాటి గ్రామంగా మారిన విల్లాలో పెళ్లి చేసుకున్నారు. అది రినోవట్ చేసిన విల్లా. బోటిక్ ప్రాపర్టీగా మారిన ప్లేస్ అది. ఇది ఇటలీలోని టుస్కానీలో ఉంటుంది. ప్రపంచంలోని 20 అత్యంత ఖరీదైన హాలిడే డెస్టినేషన్స్‌లో బోర్గో ఫినోచిటో ఒకటి. ఫోర్బ్స్ జాబితాలో బోర్గో ఫినోచిటో కూడా ఉంటుంది. ఈ అద్భుతమైన విల్లాలో ఒక వారం ఉండాలంటే కనీసం రూ. కోటి ఖర్చు అవుతుంది. ఒక రాత్రికి 6,50,000 నుంచి 14,00,000 వరకు రేట్ ఉంటుంది.
Also Read: రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం