2వేల నోట్ల విషయంలో అమెజాన్ కీలక ప్రకటన

2వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇవి సెప్టెంబర్ 30 తరువాత చెల్లవని చెప్పింది. ఈ లోపునే మార్చుకోవలని సూచించింది. ఇప్పుడు దీనిపై అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 19 నుంచి తాము స్వీకరించమని ప్రకటించింది.

New Update
Amazon: అమెజాన్‌ నుంచి వందల ఉద్యోగులు ఔట్‌!

Amazon Won't Accept 2000 Notes: 2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 తరువాత నుంచి క్యాష్ డెలివరీలో 2 వేల నోట్లను స్వీకరించమని తేల్చి చెప్పింది. ఈనోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30.

రూ.2000 నోటలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ మే నెలలో ప్రకటించింది. అయితే వెంటనే కాకుండా వాటిని మార్చుకునేందుకు పెస్టెంబర్ 30 వరకు గడువును ఇచ్చింది. 2016లో పెద్ద నోట్లు రద్దు అయినప్పుడు ఈ 2 వేల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం మళ్ళీ నోట్లను కూడా రద్దు చేయడంతో పెస్టెంబర్ 1 నాటికి 90 శాతంనోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. తిరిగివచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని వివరించారు.

Also Read: బీహార్‌ లో పడవ బోల్తా ..16 మంది పిల్లలు గల్లంతు!

Advertisment
తాజా కథనాలు