Amazon Bazaar: అమెజాన్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరలకే అన్ని వస్తువులు..

తక్కువ ధర కలిగిన ఫ్యాషన్, లైఫ్ స్టయిల్‌ ఉత్పత్తులు కస్టమర్లకు అందించే లక్ష్యంగా.. అమెజాన్ కంపెనీ 'బజార్‌' అనే ప్రత్యేక స్టోర్‌ను తీసుకొచ్చింది. ఇందులో తక్కువ ధరలకే దుస్తులు, గృహ ఉత్పత్తులు వంటివన్నీ లభిస్తాయి.

New Update
Amazon Bazaar: అమెజాన్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరలకే అన్ని వస్తువులు..

Amazon India launches Bazaar: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ మరో కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టింది. తక్కువ ధర కలిగిన ఫ్యాషన్, లైఫ్ స్టయిల్‌ ఉత్పత్తుల కోసం 'బజార్‌' అనే ప్రత్యేక స్టోర్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ (Amazon) ఆండ్రాయిడ్‌ యాప్‌లో లైవ్‌లోకి వచ్చేసింది. దాదాపు రూ.600 లోపు విలువ కలిగిన దుస్తులు, ఫుట్‌వేర్‌లు, వాచ్‌లు ఇందులో దొరుకుతాయి. తక్కువ ధరలకు వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా.. అమెజాన్ ఈ కొత్త వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది.

Also Read: పాకిస్థాన్‌లో ఉన్న గ్వాదర్ పోర్టు ఇండియాకు దక్కే ఛాన్స్ వచ్చింది.. కానీ

సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే.. చీరలు, షర్టులు, టీషర్టులు, బెడ్‌షీట్లు, గృహ ఉత్పత్తులు, హ్యాండ్‌బ్యాగులు వంటి అనేక ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న తయారీ సంస్థల నుంచి సెల్లర్లు తమ ఉత్పత్తులను ఈ బజార్‌ వేదికగా.. కస్టమర్లకు విక్రయిస్తారు. దీనికోసం సెల్లర్లు ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయడం లేదు. కానీ మనం ఆర్టర్‌ చేసే వస్తువులు డెలివరీ కావడానికి మాత్రం 4-5 రోజుల సమయం పడుతుంది.

సాధారణంగా అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఏదైనా ఆర్డర్‌ చేస్తే.. ఒకే రోజులో డెలివరీ చేస్తారు. కానీ ఈ తక్కువ ధరల ఉత్పత్తుల విషయంలో మాత్రం కాస్త సమయం పడుతుంది. ప్రీమియం ఉత్పత్తులను అదే రోజు డెలివరీ చేసే విషయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అమెజాన్. కానీ తక్కువ ధర కలిగిన ఉత్పత్తుల విక్రయంలో మాత్రం కాస్త వెనకబడింది. ఇలాంటి వ్యాపారంలో సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు కలిగిన మీషో దూసుకెళ్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ కూడా షాప్సీ పేరిట ఇదే తరహాలో ప్రత్యేకంగా ఓ యాప్‌ను నిర్వహిస్తోంది. అందుకే ఈ విభాగంలో ఉన్న లోటును భర్తీ చేసేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించి.. తన వ్యాపారాన్ని పెంచుకోవాలని భావిస్తోంది అమెజాన్.

Also Read: కాంగ్రెస్ పాలనలో రైతు ఆగమైండు.. కేటీఆర్ ఫైర్!

Advertisment
తాజా కథనాలు