Ott plat forms:నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ బాటలోనే అమెజాన్ ప్రైమ్

అందరూ తీసుకుంటుంటే మేమేం తక్కువ తిన్నాం అంటున్నారు అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు. ఓటీటీలో తమకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయింది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లలానే అమెజాన్ లోనే యాడ్స్ మొదలెడతామని చెబుతున్నారు.

New Update
Amazon prime: అమెజాన్ ప్రైమ్ వాడే వారికి షాక్.. మళ్లీ రూ.250 కట్టాలా?

అమెజాన్...ప్రపంచ వ్యాప్తంగా ఇదో పెద్ద బ్రాండ్. ఇప్పటప్పటిలో దీన్ని బీట్ చెయ్యగలిగే వారే లేరు. ఓటీటీల్లో కూడా అమెజాన్ వఎరీ సక్సెస్ ఫుల్. 25 దేశాల్లో ప్రజలు దీన్ని వాడుతున్నారు. 200 మిలియన్ల కంటే ఎక్కువ మందే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. దీనికి నెలకు వచ్చే ఆదాయమే 35.22 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మరింత క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. మిగతా ఓటీటీల మాదిరిగానే తమ ప్లాట్ ఫామ్ లోనూ యాడ్స్ ను ప్రసారం చేయాలనుకుంటున్నారు అమెజాన్ నిర్వాహకులు. దీని ద్వారా మరింత ఆదాయం గడించే ప్లాన్స్ వేస్తున్నారు.

Also read:కాసేపట్లో జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్

కొత్త ఏడాది జనవరి 29 నుంచి అమెజాన్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే ప్రకటనలపై అమెజాన్‌ యూజర్లకు మెయిల్స్ పంపించామని చెబుతోంది యాజమాన్యం. యాడ్స్ వద్దనుకుంటే మాత్రం యూజర్లు నెలకు 3 డాలర్లు అంటే నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెల నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్ల ఏడాదికి రూ.11,575 వసూలు చేస్తుంది. తాజాగా యాడ్స్‌ వద్దనుకునే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు