Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..20,000 లోపు స్మార్ట్‌ ఫోన్‌ల పై టాప్ డీల్‌!

ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్ వచ్చేసింది. ఈ సేల్ అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభం అవుతుండగా...ప్రైమ్ సభ్యులకు ముందుగానే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..20,000 లోపు స్మార్ట్‌ ఫోన్‌ల పై టాప్ డీల్‌!
New Update

Amazon Great Indian Festival 2023: ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ వచ్చేసింది. ఈ సేల్ అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభం అవుతుండగా...ప్రైమ్ (Amazon Prime) సభ్యులకు ముందుగానే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఇ- కామర్స్‌ దిగ్గజం అయిన అమెజాన్‌ ఎలక్ట్రానిక్‌ గూడ్స్ అన్నింటి మీద భారీ తగ్గింపు ధరలతో వినియోగదారుల ముందుకు వస్తుంది.

వీటిలో యూత్ మొదలుకొని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది స్మార్ట్ ఫోన్ల కోసమే. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ లో సెల్ ఫోన్ల మీద భారీ తగ్గింపు ధరలతో అనేక కంపెనీల ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో 20, 000 వేల లోపు ఏఏ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయో చూసేద్దామా!

iQOO Z7s 5G

ప్రస్తుతం, iQOO Z7s 5G (8GB RAM, 128GB స్టోరేజ్) మోడల్ ధర రూ. 17,999గా ఉంది. ఎస్బీఐ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ పై 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.1500 లు తగ్గి ఈ ఫోన్‌ రూ.16,900 కి లభిస్తుంది.

Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G (8GB RAM, 128GB స్టోరేజ్) మోడల్ రూ. 18,499 కి అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ పై ప్రైమ్ సేవింగ్స్‌తో కస్టమర్‌లు రూ. 1500 వరకు 10 శాతం తగ్గింపు ధరతో పొందవచ్చు. అంటే ఈ ఫోన్‌ ను 16,900 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

రియల్‌మే నార్జో 60

Realme Narzo 60 5G (8GB RAM, 256GB స్టోరేజ్) ప్రస్తుత ధర రూ. 18,499 గా ఉంది. ఎస్బీఐ కార్డు మీద రియల్‌ మీ తన కస్టమర్లకు 10 శాతం తగ్గింపు తో ఈ ఫోన్‌ ధర రూ.16,900 కే పొందవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G

8GB RAM, 128GB స్టోరేజ్ OnePlus Nord CE 3 Lite 5G ధర రూ.19,999 గా ఉంది. ఎస్బీఐ కార్డు ఉపయోగించి సుమారు 10 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ ను 18,600 కే పొందవచ్చు.

TECNO Camon 20 Pro 5G

19,999 ధరతో, TECNO Camon 20 Pro 5G 8GB RAM, 128GB తో మార్కెట్లో అందుబాటులో ఉంది . ఈ అమెజాన్ ఫెస్టివల్‌ లో కస్టమర్లకు 18,600 లకే లభిస్తుంది. కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్‌ కార్డులు ఉపయోగించి ఈ ఫోన్‌ మీద డిస్కౌంట్ పొందవచ్చు.

Also read: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే?

#great-indian-festival #smart-phones #amazon-great-indian-festival-2023-prime #amazon-great-indian-festival-2023 #amazon #amazon-great-indian-festival-2023-sale
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe