Amazon: అమెజాన్‌ పార్శిల్ లో పాము..షాకైన కస్టమర్‌!

బెంగళూరులో ఓ జంట అమెజాన్‌ ఆన్‌ లైన్‌ లో ఆర్టర్‌ చేసిన బాక్స్‌ లో విషపూరిత పాము కనిపించడంతో అందరూ షాక్‌ అయ్యారు. ఓ సాఫ్ట్‌వేర్‌ జంట ఆన్‌ లైన్‌ ఎక్స్‌ బాక్స్‌ కంట్రోలర్‌ ను ఆర్డర్‌ పెట్టారు.అమెజాన్‌ నుంచి వచ్చిన పార్శిల్‌ని ఓపెన్ చేయగా..అందులో పాము ఉంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

New Update
Amazon: అమెజాన్‌ పార్శిల్ లో పాము..షాకైన కస్టమర్‌!

Snake Found in Amazon Package: బెంగళూరులో ఓ జంట అమెజాన్‌ ఆన్‌ లైన్‌ లో ఆర్టర్‌ చేసిన బాక్స్‌ లో విషపూరిత పాము కనిపించడంతో అందరూ షాక్‌ అయ్యారు. ఓ సాఫ్ట్‌వేర్‌ జంట ఆన్‌ లైన్‌ ఎక్స్‌ బాక్స్‌ కంట్రోలర్‌ ను ఆర్డర్‌ పెట్టారు. డెలివరీ బాయ్‌ ఇచ్చిన పార్మిల్‌ తీసుకుని ఓపెన్ చేసి చూడగా...అందులో ఉన్న నాగుపామును చూసి వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అయితే అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకపోవడంతో ఎవరికీ హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రికార్డ్ చేసిన ఆ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాము 2 రోజుల క్రితం అమెజాన్ నుండి ఎక్స్‌ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేసాము. అయితే ఆర్డర్ వచ్చిన దానిని ఓపెన్ చేసి చూడగా ప్యాకేజీలో బతికి ఉన్న నాగుపాము ఉంది. ప్యాకేజీని డెలివరీ భాగస్వామి నేరుగా మాకు అందజేసారు. మేము సర్జాపూర్ రోడ్డులో ఉంటున్నాం.

మేము ఈ సంఘటనను కెమెరాలో రికార్డు చేశాం. దానికి తోడు మాతో మరికొంతమంది కూడా ఉన్నారని సంబంధిత బాధితుడు సోషల్ మీడియాలో వాపోయాడు. అదృష్టవశాత్తూ, పాము ప్యాకేజింగ్ టేప్‌కు ఇరుక్కుపోయింది. దాంతో మా ఇంట్లో అపార్ట్‌మెంట్‌లో ఎవరికీ హాని కలిగించలేదు అంటూ వివరించారు. ఇంకా ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధులతో సంప్రదించగా వారు వెంటనే రియాక్ట్‌ అయ్యారు.

కస్టమర్ వీడియోపై స్పందిస్తూ అమెజాన్ ఇండియా కంపెనీ ట్వీట్ చేసింది. అమెజాన్ ఆర్డర్‌తో మీకు కలిగిన అసౌకర్యం గురించి తెలుసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి. మేము దీన్ని తనిఖీ చేయాలనుకుంటున్నాం. దయచేసి అవసరమైన వివరాలను ఇక్కడ భాగస్వామ్యం చేయండి. విషయాలను మా బృందం పొందుతుంది. ఇందుకు సంబంధించి అప్డేట్ తో త్వరలో మీ వద్దకు తిరిగి వస్తాము అంటూ తెలిపింది. ఇక ఆ విషపూరిత పామును ప్రజలకు అందుబాటులో లేకుండా సురక్షితంగా బహిరంగ ప్రదేశంలో వదిలేశారు.

Also read: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు