life Style: అరటి పండు తినడం లేదా? అయితే, మీరు ఈ లాభాలను మిస్ అయినట్లే..!

అరటిపండు కేవలం రుచిగా ఉండటం మాత్రమే కాదు దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని మన అందరికి తెలుసు. కానీ ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల చర్మానికి కలిగే ఈ ఏడు లాభాల గురించి తెలిస్తే వీటిని మీరు తప్పక మీ ఆహారంలో చేర్చుకుంటారు.

New Update
life Style: అరటి పండు తినడం లేదా? అయితే, మీరు ఈ లాభాలను మిస్ అయినట్లే..!

life Style: మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను తినకుండా పక్కన పెడుతుంటాము. కొందరు కొన్ని రకాల పండ్లను ముట్టుకోరు. పండ్లు తినడం వల్ల అవి శరీరానికి చాలా పోషకాలను అందించడంతో పాటు చర్మానికి కూడా చాలా ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యంగా అరటిపండు.. ఇవి తినడానికి రుచికరంగా ఉండడంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా చాలా సహాయపడుతాయి. కొంత మంది అరటిపండు తినరు.. కానీ ఈ పండు వల్ల చర్మానికి  కలిగే ఈ ఏడు లాభాలను గురించి తెలుసుకుంటే మీరు వీటిని ఖచ్చితంగా తింటారు..

అరటి పండు తింటే చర్మానికి కలిగే లాభాలు..

  • అరటిపండులో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషించి చర్మం మెరుగ్గా కనిపించేలా చేస్తాయి.
  • వీటిలో సహజంగా ఉండే నూనె, నీటి శాతం చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచి, చర్మం మృదువుగా ఉండేలా తయారు చేస్తాయి.
  • అరటిపండులో విటమిన్ C ఉంటుంది. ఇది చర్మం పై ఉన్న నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని మరింత ప్రకాశవంతగా చేయడానికి సహాయపడుతుంది.
  • ఈ పండులోని ఎంజైమ్స్ చర్మం పై ఉన్న మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా కనిపించేలా తయారు చేస్తుంది.
  • అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖాన్ని ముడతలు, గీతలు వంటి సమస్యల నుంచి కాపాడతాయి. అలాగే  చర్మం పై ముడతలను తగ్గించి ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
  • అరటిపండులోని ప్రత్యేక గుణాలు ఎర్రబడటం, మొటిమలు, సోరియాసిస్ తదితర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
  • అరటిపండులోని విటమిన్ C, పొటాషియం ముఖం పై మొటిమలను కలిగించే బాక్టీరియాతో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి.

అంతే కాదు అరటిపండును ముఖ సౌందర్యం కోసం వాడే ఉత్పత్తుల్లో కూడా వాడుతుంటాము. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అరటిపండును తినేటప్పుడు మీ శరీరం, ఆరోగ్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తినాలి. ఎందుకంటే కొందరిలో ఇవి తినడం వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Also Read: Tips: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు

Advertisment
తాజా కథనాలు