మీరా వారసులు..?
అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం అందించాలని కోరినా..ఆహ్వానం మాత్రం అందలేదన్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో చంద్రబాబు, పురంధేశ్వరిపై లక్ష్మీ పార్వతి సంచనల కామెంట్స్ చేశారు. స్మారక నాణెం ఆవిష్కరణకు మీకు ఆహ్వానం అందిందా అని చాలా మంది అడిగారు.ఈ విషయమై నేను రాష్ట్రపతికి పలువురు ప్రముఖులకు లేఖ రాశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని భావించాను లక్ష్మీ పార్వతి చెప్పుకోచ్చారు. ఒకవేళ ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అయితే నేను ఫైట్ చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులే నేడు ఆయన వారసులని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు.
ఆ పత్రికలు చూడండి..
ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్నారా? లేదా? కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలని ఆమె నిలదిశారు.లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ వివాహం అయిందని.. ఆనాడు అన్ని పత్రికలు ప్రచురించాయని గుర్తు చేశారు. నేను ఎన్టీఆర్ భార్యని.. మెడలో బోర్డు పెట్టుకుని ఎన్నాళ్ళు తిరగాలని అన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ కుటుంబం నన్ను చిత్రహింసలకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ సంబంధం పెట్టుకుని ఉండి ఉంటే ఎన్టీఆర్ యుగపురుషుడు ఎలా అవుతాడు? అని ప్రశ్నించింది. నేటి నుంచి ఈ కుటుంబంపై పోరాటం ప్రారంభించి.. చంద్రబాబు, పురందేశ్వరిలను రాష్ట్రం నుంచి తరిమికొడతా.. వీళ్ళా ఎన్టీఆర్ వారసులు అంటూ మండిపడ్డారు. నేడు ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు.
రాజకీయ పిచ్చితోనే.. ఒక్క సీట్ రాదు
మా పెళ్ళి సందర్భంలో మీ ఆయన ఇచ్చిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతావు అంటూ పురందేశ్వరిని ప్రశ్నించింది. నేనంటూ రాకపోతే ఎన్టీఆర్ తిరిగి లేచేవారా? కనీసం ఆయనకు కుటుంబ సభ్యులకు బిళ్ళలైన ఇచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరికి రాజకీయ పిచ్చి పట్టిందన్నారు. ఈమెకు కూడా రెండు నాలుకలు ఉన్నాయని.. రాష్ట్రంలో చంద్రబాబు, పురందేశ్వరి ఒక్కటయ్యారని విమర్శించారు.కేంద్రం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనకు కూడా పురంధేశ్వరి అడ్డుపడుతోందని అన్నారు. ఈరోజు నుంచి పురంధేశ్వరి నీతో నాకు ఫైట్ అని సవాల్ చేశారు. నా భర్తకు అన్యాయం చేసిన దుర్మార్గులు చంద్రబాబు, పురందేశ్వరే అని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి పర్యటించిన ప్రతిచోటా ఒక్కసీట్ కూడా రాకుండా.. నేను పోరాటం చేస్తనని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వమే ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమం చేసివుంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాటం చేస్తాను..మీ దుర్మార్గాలను ఎండ గడుతూనే ఉంటానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.