Actor Sameer : "అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. ఇది కరెక్ట్ కాదు".. యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ ఈ వారం ఇంటి సభ్యులు ఫినాలే టికెట్ కోసం పలు టాస్కుల్లో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా లేటెస్ట్ గా జరిగిన ఓ టాస్క్ లో అమర్ ఫౌల్ గేమ్ ఆడినట్లు ఎక్స్ కంటెస్టెంట్ యాక్టర్ సమీర్ స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Actor Sameer : "అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. ఇది కరెక్ట్ కాదు".. యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్..!
New Update

Actor Sameer: బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్స్ తో పోలిస్తే సీజన్ 7 (Bigg Boss Telugu 7) కాస్త బిన్నంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో షో పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచారు. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలానే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టికెట్ టూ ఫినాలే టాస్క్ ఇచ్చారు. దీంట్లో బిగ్ బాస్ ఫినాలే టికెట్ గెలవడానికి పలు ఛాలెంజెస్ ఇచ్చారు. ఈ ఛాలెంజెస్ లో భాగంగా జరిగిన ఓ టాస్క్ పై.. బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ యాక్టర్ సమీర్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

publive-image

అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. టికెట్ టూ ఫినాలే ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమర్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రశాంత్ పాల్గొన్నారు. దీంట్లో బజర్ మోగే లోపు క్రికెట్ స్టంప్స్ పై ఎవరి రింగ్స్ ఎక్కువగా పడితే వాళ్లకు ఎక్కువ పాయింట్స్ లభిస్తాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ టాస్క్ పై సమీర్ స్పందించారు. "బజర్ మోగిన తర్వాత అమర్ స్టంప్స్ పై రింగ్ వేశాడు. అది ఫౌల్ గేమ్ అని..ఈ విషయాన్నీ ఎవరూ గమనించలేదు.. బిగ్ బాస్ కూడా చెప్పకపోవడం బాధగా ఉంది. సంచాలకులుగా శోభ, ప్రియాంక అమర్ (Amar) కు ఫెవర్ చేశారు. దీని వల్ల కేవలం ఒక రింగ్ మాత్రమే తేడా ఉన్న అర్జున్ (Arjun Ambati) నష్టపోయాడు. ఇది కరెక్ట్ కాదు .. చాలా అన్యాయం.. అందుకని నేను ఈ వీడియోను చేస్తున్నానని మాట్లాడారు. ఇది బిగ్ బాస్ వరకు చేరాలని ఆశిస్తున్నానని" తెలిపారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: గౌతమ్ ఎలిమినేటెడ్..? ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్..!

#bigg-boss #amar #bigg-boss-7-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి