Mobile Calls : ప్రతీ కాల్‌కీ కాలర్ పేరు తెలియాల్సిందే.. ట్రాయ్

మొబైల్స్, కాల్స్, స్పామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టనుంది ట్రాయ్. ప్రతీ కాల్‌తో కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు కూడా తెలిసేలా కొత్త ప్రతిపాదన చేసింది. దీనికి ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అని పేరు పెట్టింది.

New Update
Mobile Calls : ప్రతీ కాల్‌కీ కాలర్ పేరు తెలియాల్సిందే.. ట్రాయ్

True Caller ID : స్పామ్ కాల్(Spam Calls) సమస్యలు ఇక మీదట తొలగిపోనున్నాయి. వీటి ద్వారా ప్రజలు పడుతున్న బాధలను టెలికాం రెగ్యులేటర్ పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం కొత్త వ్యక్తులు ఎవరు కాల్ చేసినా వారి అసలు పేరు వెల్లడించాలని ప్రతిపాదించారు. దీనికి ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్(Introduction of Calling Name Presentation) అని పేరు పెట్టారు. భారతీయ నెట్ వర్క్ CNAP సేవకు సబంధించి ట్రాయ్(TRAI) పైన సూచనలు చేసింది. టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకున్నాకనే ఈ కొత్త ప్రతిపాదన గురించి సూచనలు అందించామని ట్రాయ్ చెబుతోంది. టెలికాం డిపార్ట్‌మెంట్ కాల్ చేసిన వ్యక్తుల నిజమైన గుర్తింపును బహిర్గతం చేస్తుందని చెబుతోంది ట్రాయ్.

నిజానికి ఈ ప్రతిపాదన 2022 మార్చిలోనే చేసింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్. అదే ఏడాది నవంబర్‌లో ట్రాయ్‌ కూడా దీనిని ప్రతిపాదించింది. సంబంధిత అన్ని పార్టీలను ఆహ్వానించింది కూడా. అప్పుడు దీని గురించి పెద్ద చర్చే జరిగింది. కొంత మంది అనుకూలంగా, మరి కొంత మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పుడు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ట్రాయ్ తన సూచనలను వెల్లడించింది.

Also Read : Bank Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్.. 3,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్!

ప్రస్తుతం అన్ని ఫోన్లలో కాలర్ ఐడీ(Caller ID) చూపించే పద్ధితి లేదు. కొన్ని నెట్‌వర్క్‌లు కూడా వీటిని గోప్యంగా ఉంచుతాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇక మీదట ప్రతీ కాల్‌.. కాలర్ నిజమైన గుర్తింపును బహిర్గతం చేయాలి. ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెబుతోంది ట్రాయ్. ఆ తర్వాత నుంచి కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు మీ మొబైల్‌లో కాలర్ నంబర్‌తో పాటూ కనిపిస్తుందని తెలిపింది. వినియోగదారులు నంబర్ తీసుకునేప్పుడు ఇచ్చిన ఐడీలో ఉన్న పేరు కూడా నంబర్‌తో పాటూ కనిపిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రతిపాదనలు కొన్ని కంపెనీలకు నష్టాన్ని తీసుకురావచ్చునేమో కానీ సాధారణ వినియోగదారులకు మాత్రం చాలా పెద్ద హెల్ప్‌గా నిలుస్తుంది.

ప్రస్తుతానికి ట్రూకాలర్(True Caller) వంటి సంస్థలు కాలర్ ఐడీ సేవలను అందిస్తున్నాయి. కానీ అందులో కూడా కాలర్ అసలు పేరు తెలుసుకోలేకపోతున్నారు. దీనివలన డిజిటల్ మనీ మోసాలు, కాల్ ద్వారా మోసం చేయడం, స్పామ్ కాల్స్, ఎడ్వటైజింగ్ కాల్స్‌తో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ఈ మోసం లేదా స్పామ్ కాల్స్‌ను అరికట్టడం సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు తెస్తున్న కొత్త ప్రతిపాదన వలన ఈ సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చని ట్రాయ్ అభిప్రాయపడుతోంది.

Advertisment
తాజా కథనాలు