T20 World Cup 2024: కుంగ్ ఫూ పాండ్యాతో పాటు ఆ స్టార్ ఆటగాడికి టీమిండియాలో చోటు కష్టమే! ఐపీఎల్ 2024 ఆటను దృష్టిలో ఉంచుకుని కొందరు స్టార్ ప్లేయర్లను బీసీసీఐ సెలక్టర్లు పొట్టి ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే ఎలాంటి అంచనాలు లేని వారిని జట్టులోకి తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయితే జట్టులో ఎవరకు ఛాన్స్ దక్కేనో ఇప్పుడు చూద్దాం! By Durga Rao 26 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్‌లో ఎన్నో ట్విస్టులను చూస్తున్నారు. ఇప్పటి వరకు లీగ్‌లో చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. ఏకపక్షంగా రిజల్ట్ వచ్చిన గేమ్స్ చాలా తక్కువ. ముఖ్యంగా లీగ్ మొత్తంలో బ్యాటర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. కొందరు బౌలర్లు సైతం నిలకడ ప్రదర్శన చేస్తూ తమ జట్లకు విజయాలు అందిస్తున్నారు. అయితే జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టోర్నీకి మే 1 నాటికి అన్ని దేశాలూ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత్ మాత్రం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే స్క్వాడ్‌ను సెలక్ట్ చేయనుంది. అయితే ఐపీఎల్ 2024 ప్రదర్శన పరిశీలిస్తే, కొందరు స్టార్ ప్లేయర్లను బీసీసీఐ సెలక్టర్లు పొట్టి ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే ఎలాంటి అంచనాలు లేని వారిని జట్టులోకి తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. * టీ20 స్క్వాడ్ అంచనా ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో జరిగిన 30 మ్యాచ్‌ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే.. T20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో కొందరికి ప్లేస్ కన్ఫామ్ అయినట్లు చెప్పుకోవచ్చు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శివమ్ దూబే, రిషబ్ పంత్ (wk), దినేష్ కార్తీక్ (wk), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, టి నటరాజన్ , హర్షిత్ రాణా ఉండవచ్చు. * బౌలర్లు ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు ఆరుగురు బౌలర్లు సత్తా చాటారు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్లుగా టీ20 స్క్వాడ్‌కు ఎంపిక కావచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, టి నటరాజన్ పేస్ బౌలింగ్ ఆప్షన్లుగా ఉన్నారు. బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్ష్‌దీప్ కొత్త బాల్‌తో అద్భుతాలు చేయగలడు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతడి ప్లస్ పాయింట్. పరిస్థితిని బట్టి హర్షిత్ రాణాతో మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయించవచ్చు, పవర్‌ప్లేలో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే నటరాజన్ డెత్ స్పెషలిస్ట్. అతడు మిడిల్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేయగలడు. ఈ ఆరుగురు బౌలర్లలో నలుగురు ఈ సీజన్‌లో టాప్ 10 వికెట్లు తీసినవారిలో ఉన్నారు. రాణా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అర్ష్‌దీప్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అయినా అతడు 2024 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. * టాప్ ఆర్డర్ ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బెస్ట్ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించిన విరాట్.. 63.16 యావరేజ్, 150.39 స్ట్రైక్ రేట్‌తో సత్తా చాటుతున్నాడు. రోహిత్ 162.90 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మ లీగ్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ అతడు 215.96 స్ట్రైక్ రేట్‌తో పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. సంజూ శాంసన్ 62.8 యావరేజ్, 152.42 స్ట్రైక్ రేట్‌తో నిలకడగా ఆడుతున్నాడు. * మిడిల్, లోయర్ మిడిల్ ఆర్డర్ మిడిల్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కొందరు యంగ్‌స్టర్స్ సక్సెస్ అయ్యారు. రియాన్ పరాగ్, శివమ్ దూబే, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ బెస్ట్ స్ట్రైకింగ్‌తో ఫినిషర్ రోల్స్‌కు మారుపేరుగా ఉన్నారు. దూబే, పరాగ్, పంత్, కార్తీక్ అందరూ హాఫ్ సెంచరీలు సాధించారు. వీరు మిడిల్, డెత్ ఓవర్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడుతున్నారు. పరాగ్ స్ట్రైక్ రేట్ 161.42 కాగా, దూబే 169.94, పంత్ 161.32, కార్తీక్ 196.09 స్ట్రైక్ రేటుతో పరుగులు చేస్తున్నారు. అయితే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ టీ20 స్క్వాడ్‌లో ఉండటం కష్టమే. * ఆల్ రౌండర్లు ఈ టీ20 వరల్డ్ కప్‌కు రవీంద్ర జడేజా, శివమ్ దూబే ఇద్దరూ ప్రధాన ఆల్ రౌండర్ ఆప్షన్లుగా చెప్పుకోవచ్చు. అయితే అభిషేక్, పరాగ్ కూడా ఈ బాధ్యతలకు సెట్ అవుతారు. జడేజా ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే 78.5 బ్యాటింగ్ యావరేజ్, 131.93 స్ట్రైక్ రేటుతో సెలక్టర్లను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఎడమచేతి వాటం బౌలర్ అయిన జడ్డూ, డిఫెన్సివ్ బౌలర్‌గా CSK తరఫున 7.85 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. పరాగ్, అభిషేక్ కూడా బౌలింగ్ చేశారు, కానీ ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే చెన్నై జట్టులో దూబే బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. #cricket #hardik-pandya #ipl-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి