Pushpa 2 OTT Rights : రికార్డు ధర పలికిన 'పుష్ప 2' ఓటీటీ రైట్స్.. వామ్మో.. అన్ని వందల కోట్లా?

'పుష్ప 2'ఓటీటీ రైట్స్ రికార్డు ధర పలికినట్లు తాజా సమాచారం. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఏకంగా రూ.270 కోట్లకు అమ్మారట. ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడవ్వకపోవడం గమనార్హం.

Pushpa 2 OTT Rights : రికార్డు ధర పలికిన 'పుష్ప 2' ఓటీటీ రైట్స్.. వామ్మో.. అన్ని వందల కోట్లా?
New Update

Pushpa 2 OTT Rights : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2'. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, ఫహద్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే పలు సార్లు వాయిదా వేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ రికార్డు ధర పలికినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. 'పుష్ప 2' ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.270 కోట్లకు అమ్మారట.

Also Read : దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..!

ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడవ్వలేదు. ఇది కేవలం 'పుష్ప 2' కు మాత్రమే సాధ్యమైంది. ఈ లెక్కన చూస్తే రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాల బాట పట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు మేకర్స్.

#allu-arjun #pushpa-2
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe