Pushpa 2 OTT Rights : రికార్డు ధర పలికిన 'పుష్ప 2' ఓటీటీ రైట్స్.. వామ్మో.. అన్ని వందల కోట్లా? 'పుష్ప 2'ఓటీటీ రైట్స్ రికార్డు ధర పలికినట్లు తాజా సమాచారం. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఏకంగా రూ.270 కోట్లకు అమ్మారట. ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడవ్వకపోవడం గమనార్హం. By Anil Kumar 03 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Pushpa 2 OTT Rights : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2'. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, ఫహద్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా వేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ రికార్డు ధర పలికినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. 'పుష్ప 2' ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.270 కోట్లకు అమ్మారట. Also Read : దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..! ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడవ్వలేదు. ఇది కేవలం 'పుష్ప 2' కు మాత్రమే సాధ్యమైంది. ఈ లెక్కన చూస్తే రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాల బాట పట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు మేకర్స్. #allu-arjun #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి