Allu Arjun to get wax statue at Madame Tussauds: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్(Madame Tussauds) మ్యూజియంలో అల్లు అర్జున్(Allu Arjun) మైనపు విగ్రహం. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన తెలుగు హీరోల సినిమాలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.
బాహుబలి (Baahubali), KGF, RRR వంటి సినిమాలు తెలుగు సినిమాల గొప్పతనం ప్రపంచం మొత్తం తెలిసేలా చేసాయి. ఇదే తరుణంలో ఐకాన్ స్టార్ కు లండన్ లోని అత్యంత ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహానికి(Wax Statue) చోటు దక్కింది. ఆ మ్యూజియంలో విగ్రహం ఉండటం గొప్పగా భావిస్తారు.
ఇప్పటికే స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలకు ఆ మ్యూజియంలో(Museum) చోటు దక్కింది. ఇప్పుడు ఆ గౌరవం ఐకాన్ స్టార్ కు (Icon Star) దక్కింది. అయితే వచ్చే ఏడాది కళ్ళా అల్లు అర్జున్ మైనపు విగ్రహం సిద్దమవుతున్నట్లు తెలిసింది. దీని కోసం బన్నీ లండన్ వెళ్లి విగ్రహానికి సంబందించిన కొలతలను ఇచ్చినట్లు 'మేడమ్ టుస్సాడ్స్' ట్విట్టర్ వేదికగా వీడియోను రిలీజ్ చేసింది. దీని పట్ల బన్నీ.. ఈ మ్యూజియంలో నా విగ్రహాన్ని చూసుకోవడం చాలా ఆనందం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలను మాత్రమే పరిగణలో ఉండేవారు, ఇప్పుడు ఆ గౌరవం తెలుగు హీరోలకు కూడా దక్కింది.
ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు(National Award) పొందిన బన్నీ తన ఆనందాన్ని కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 (Pushpa 2) సినిమా పనుల్లో బిజీ బిజీ గా ఉన్నారు. పుష్ప 2 కు సంబందించిన పోస్టర్ నీ బన్నీ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన పేరును వినిపించేలా చేసాడు. కమర్షియల్ హిట్ గా నిలిచిన 'ఆల వైకుంఠపురం' తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మరో సినిమాకు సిద్దమవుతున్నారట.
Also Read: అరెరె.. బుట్టబొమ్మకు పెద్ద గాయమే అయ్యిందిగా.. అసలేం జరిగిందంటే..