/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-23T173646.079.jpg)
Allu Arjun Vs Mega fans: ఏపీ ఎన్నికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పారవికి సపోర్ట్ గా నంద్యాలకు వెళ్లడం మెగా ఫ్యామిలీలో చిచ్చురేపింది. దీని పై బన్నీ చాలా ట్రోల్స్ నే ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయంలో కొంత మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడగా.. మరికొంత మంది అభిమానులు బన్నీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కాస్త నెట్టింట అల్లు vs మెగా ఫ్యాన్స్ వార్ గా మారింది. బన్నీ పై ట్రోల్స్ ను ఖండిస్తూ అల్లు ఫ్యాన్స్.. మెగా ఫ్యామిలీ పై వస్తున్న ట్రోల్స్ ను ఖండిస్తూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధమే సృష్టించారు. ఇప్పటికీ అల్లు vs మెగా వివాదం కొనసాగుతూనే ఉంది.
అల్లు vs మెగా ఫ్యాన్స్
ఇక ఈ ఫ్యాన్ వార్ కేవలం కామెంట్లతో ఆగిపోలేదు.. ఏకంగా ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. నిన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా 'ఇంద్ర' మూవీ రీరిలీజ్ చేయడంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అయితే ఓ థియేటర్ లో మాత్రం అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఓ అభిమాని సినిమా చూస్తుండగా జై బన్నీ అనడంతో రెచ్చిపోయిన మెగా ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ పై గొడవకు దిగారు. వివాదం పెరగడంతో ఇరువురి ఫ్యాన్స్ థియేటర్లో కొట్టుకునే వరకు వెళ్ళింది. కుర్చీలతో ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన మరికొంత మంది నెటిజన్లు ''వాళ్లకు లేని బాధ వీళ్ళకేంటి.. పనిపాట లేక ఇలాంటివి చేస్తారు'' అంటూ కడిగిపారేస్తున్నారు. అయితే ఈ వీడియో దీనికి సంబంధించినదేనా? లేక ఎవరైనా కావాలనే ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్నారా? అన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం అల్లు vs మెగా ఫ్యాన్స్ ఫైట్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Evado jai bunny annadu anta vaadi gudda pagal dengaru Mega fans 🤣💥
Fafam Ra..!😂 Ala AAmthulu Ralela Koduthunnaru Entraa..!🤣#indra4k #Indra4KRerelease #GabbaSingh4K pic.twitter.com/rbSoXi3Rtb
— Santosh kumar Bolla (@Pspk_Edito_Bsk) August 23, 2024
Also Read: Salman Khan : సల్మాన్ ఖాన్ కు ఆ సినిమా రీమేక్ చేయాలని ఉందట..! - Rtvlive.com