Allu Arjun: పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెష్.. ట్విట్టర్ లో పోస్ట్

నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ మధ్య అల్లు vs మెగా ఫ్యాన్స్ వివాదం నేపథ్యంలో బన్నీ ట్వీట్ విశేషంగా మారింది.

New Update
Allu Arjun: పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెష్.. ట్విట్టర్ లో పోస్ట్

Allu Arjun: ఈ మధ్య మెగా vs అల్లు ఫ్యాన్స్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పారవికి సపోర్ట్ చేయడానికి వెళ్లడంతో ఈ రచ్చ మొదలైంది. ఓ వైపు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలబడిన సమయంలో అల్లు అర్జున్ వెళ్లి అదే పార్టీ నేతకు మద్దతివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో మెగా అభిమానులు బన్నీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని అనే వార్తలు కూడా వచ్చాయి.

పవన్ కళ్యాణ్ కు బన్నీ విషెష్

ఈ నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెష్ చెప్పడం విశేషంగా మారింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో బయట అనుకుంటున్నట్లుగా మెగా, అల్లు కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేనట్లే అనిపిస్తుంది. అలాగే ఈ ట్వీట్ చూసిన కొంత మంది ఫ్యాన్స్ కూడా.. 'టుడే మోస్ట్ అవైటెడ్ ఇది' అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల విషెస్.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు