Allu Arjun : 'కల్కి' పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ!

'కల్కి' మూవీ చూసిన బన్నీ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అద్భుతమైన విజువల్ వండర్. నా మిత్రుడు ప్రభాస్‌ నటన సూపర్బ్‌. ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమా అని అన్నాడు.

New Update
Allu Arjun : 'కల్కి' పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ!

Allu Arjun Special Tweet On Kalki Movie :పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్‌ (Prabhas) నటించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్స్ పరంగానూ గత సినిమాల రికార్డ్స్ ను బద్దలుకొడుతూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్, సుకుమార్, రాజమౌళి, మోహన్ బాబు లాంటి అగ్ర తారలు సినిమాపై పొగడ్తలు కురిపించారు.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం చేరాడు.

కల్కి మూవీ చూసిన బన్నీ చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు." కల్కి టీమ్‌కు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్‌ నటన సూపర్బ్‌. అమితాబ్‌ బచ్చన్‌ నటన గురించి ఇక మాటల్లేవ్. కమల్‌ హాసన్‌,దీపికా పదుకొణె, దిశా పటానీ నటన అద్భుతం. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్‌ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు.

Also Read : అల్లరి నరేష్ ఊరమాస్ పెర్ఫార్మెన్స్.. అంచనాలు పెంచేసిన ‘బచ్చల మల్లి’ గ్లింప్స్..!

ఇంత రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వనీదత్‌, స్వప్నదత్‌, వైజయంతి మూవీస్‌కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు నాగ్. మా తరానికి చెందిన నాగ్‌ ‍అశ్విన్‌కు ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన చిత్రమే కల్కి" అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

Advertisment
తాజా కథనాలు