Pushpa 2: ''సూసేకి అగ్గిరవ్వ మాదిరి'... పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' కపుల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. అద్భుతమైన మ్యూజిక్, వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Pushpa 2: ''సూసేకి అగ్గిరవ్వ మాదిరి'... పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..!
New Update

Pushpa 2: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కథనాయికగా నటించగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగల్ మూవీ పై అంచనాలను భారీగా పెంచేశాయి. పుష్ప 2 తో సుకుమార్- అల్లు అర్జున్ మరో సారి రికార్డులు తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది.

'సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి'

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇటీవలే విడుదలైన 'పుష్ప పుష్ప' సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా సెకండ్ సింగల్ రిలీజ్ చేశారు. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి' కపుల్ అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ కు శ్రీవల్లి, పుష్పరాజ్ కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

మ్యూజిక్, వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్న ఈ పాటను పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ పాడింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ అన్ని భాషల్లోనూ శ్రేయో ఘోషల్‌ పాడటం విశేషం. టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు.

Also Read: Mamitha Baiju: బంపరాఫర్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..? - Rtvlive.com

#pushpa-2-song #pushpa-2
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe