Pushpa 2: రిలీజ్ కు ముందే.. బుక్ మై షోలో పుష్ప 2 రికార్డు

అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు ముందే సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. తాజాగా బుక్ మై షో సినిమా పై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి పోల్ నిర్వహించగా.. రిలీజ్ కు ముందే లక్ష యాభైవేల మంది ఆసక్తిని పొంది రికార్డ్ క్రియేట్ చేసింది.

New Update
Pushpa 2: ఆ భాషలో కూడా విడుదల అవుతున్న పుష్ప 2!

Pushpa 2: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా ఎక్కువగా నడుస్తుంది. వాటిలో ఒకటి అల్లుఅర్జున్ (Allu Arjun) పుష్ప 2. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021 లో రిలీజైన 'పుష్ప ది రైజ్' వందల కోట్ల వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో.. దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

పుష్ప 2

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం 2024 ఆగస్టు 15 న విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ కు ముందే పుష్ప 2 పై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ మొదలైంది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కు ముందే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

Also Read: మెగా హీరో “మట్కా”… వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..!

publive-image

పుష్ప 2 బుక్ మై షో రికార్డు

ఇక తాజాగా ఈ సినిమా బుక్ మై షోలో కూడా అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప ది రూల్' ఆగస్టు 15 న రిలీజ్ కానున్న నేపథ్యంలో బుక్ మై షో సినిమా పై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ఒక పోల్ నిర్వహించగా.. 150K పైగా ఇంట్రెస్టులు వచ్చాయి. అంటే లక్ష యాభై వేల మంది ఆసక్తిని ఈ సినిమా పొందింది. రిలీజ్ కు ఏడు నెలల ముందే ఇంత పెద్ద మార్క్.. చేరుకొని రికార్డును నమోదు చేసింది ఈ చిత్రం. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: Rashmika Deep FakeVideo: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisment
తాజా కథనాలు