Allu Arjun : బన్నీ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా?

'పుష్ప2' తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన నెక్స్ట్ మూవీ చేయనున్నారట. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనుంది. మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌ డీటెయిల్స్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Allu Arjun : బన్నీ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా?

Allu Arjun Next Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప2’తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రెజెంట్ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 6 న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

దీని తర్వాత సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనుంది.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేట్ కు ‘రాజా సాబ్’ టీజర్

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలిసింది. మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్టు ను తెరకెక్కించబోతున్నారని, ఇందులో బన్నీ న్యూలుక్‌లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు