గంగోత్రి (Gangotri) (2003) లో అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ కుమారుని గా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో బన్నీ నటన చూసి మొదటి సినిమాకే చాలా బాగా చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడే కానీ... ఫేస్ వాల్యూ లేదు.. ఇండస్ట్రీలో కష్టం అని చాలా మంది అన్నారు. ఈ మాటలు అన్ని బన్నీ చెవికి చేరాయో ఏమో... మరి... రెండో సినిమా ఆర్య (Arya).. మొదటి సినిమాలో చేసింది.. రెండో సినిమాలో చేసింది ఒకరేనా అనే స్థాయికి వెళ్లాడు.
అక్కడితో ఆగలేదు.. బన్నీ(Bunny) గా వేరే లుక్ లో కనిపించి.. యువతుల కలల రాకుమారుడిగా మారాడు..అప్పటి వరకు ఒక ఎత్తు.. అక్కడి నుంచి ఓ ఎత్తు అన్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి వరకు ఎవరు ట్రై చేయని సిక్స్ ప్యాక్(Six Pack) బాడీని ఇండస్ట్రీకి పరిచయం చేసి మాస్ హీరోగా అవతారమెత్తాడు. నటనకు పనికి రాడు అన్నవారే.. బన్నీ డేట్స్ కోసం వెయిట్ చేశారు అంటే అల్లు వారాబ్బాయి ఏ రేంజ్ లో తనని తాను ఇండస్ట్రీలో నిలబెట్టుకున్నాడో తెలుస్తుంది.
అక్కడితో ఆగకుండా తన డ్యాన్స్ తో కుర్రకారులో కొత్త జోష్ నింపాడు. డ్యాన్స్ లో కొత్త కొత్త స్టెప్పులతో మాస్ జనాలకు బాగా దగ్గరయ్యాడు. అంతటితో సరిపెట్టుకుంటే ఎలా అనుకున్నాడేమో.. ఎంచుకునే కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఎంచుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆయన తోటలో విరబూసింది పుష్ప.
ఈ సినిమాలో నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు అరుదైన గౌరవాన్ని తెచ్చి పెట్టి తనని జాతీయ నటుడిగా నిలబెట్టుకున్నాడు. 69 సంవత్సరాల జాతీయ అవార్డుల వేడుకలో ఏ తెలుగు నటుడికి దక్కని గౌరవాన్ని దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమను ఓ స్థాయిలో నిలబెట్టాడు. ఫేస్ వాల్యూ లేదు అన్నవారే.. స్టైలిష్ స్టార్ అనే స్థాయి నుంచి ఐకాన్ స్టార్ (Icon Star) అనే స్థాయికి ఎదిగి ఒదిగిన అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెబుతుంది ఆర్టీవీ యజామాన్యం.
Also Read: ట్రిపుల్ సెంచరీ దాటేసిన చికెన్.. రానున్న రోజుల్లో కష్టమే