Mrunal Thakur: తెలుగింటి కోడలు కాబోతున్న '' సీతారామం'' బ్యూటీ?

త్వరలోనే మృణాల్‌ ఠాకూర్‌ కూడా తెలుగింటి కోడలు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కొంత కాలం క్రితం అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠిని కూడా తెలుగింటి కోడల్ని అవ్వమని ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ఆయన మృణాల్‌ ని కూడా తెలుగింటి కోడల్ని అవ్వమని అన్నారు. దీంతో త్వరలోనే మృణాల్‌ కూడా తెలుగు కోడలు అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది.

New Update
నానితో రొమాన్స్.. అనుకున్నదానికంటే ఎక్కువే అయినా బాగుంది: మృణాల్

Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్‌ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). అయితే మృణాల్‌తో అల్లు అరవింద్‌ (Allu Aravind) అన్న మాటలు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వైరల్‌ అవుతున్నాయి. ఎందుకంటే కొంత కాలం క్రితం అల్లు అరవింద్‌ ఓ వేడుకలో లావణ్య త్రిపాఠిని తెలుగింటి కోడలు అవ్వమని ఆశీస్సులు అందించారు.

ఈ క్రమంలోనే రెండు రోజుల్లో లావణ్య (Lavanya Thripati) మెగా ఇంటి కోడలు కాబోతుంది. దాంతో అందరూ అల్లు అరవింద్‌ అన్న మాటల గురించి చర్చించుకున్నారు. అయితే తాజాగా అల్లు అరవింద్‌ మృణాల్‌ ని కూడా తెలుగింటి కోడలు అవ్వమని అన్నారు. ఆ మాటలకు మృణాల్‌ నవ్విందే తప్ప ఇంకా ఏం మాట్లాడలేదు.

Also read: మనీష్‌ సిసోడియాకు షాక్‌.. బెయిల్‌ కి సుప్రీం కోర్టు నిరాకరణ!

ప్రస్తుతం మృణాల్‌ నానితో హాయ్‌ నాన్న..విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తుంది. అవకాశాలు వస్తున్నాయి కదా అని మృణాల్‌ ఏ సినిమాతో పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటుంది. ఇటీవల ఈ భామ సౌత్‌ బిగ్గెస్ట్‌ అవార్డుల ఫంక్షన్ సైమా దుబాయ్‌ లో నిర్వహించిన అవార్డుల ఈవెంట్‌ లో పాల్గొంది.

సీతారామం సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఆమె అవార్డుని అందుకుంది. ఈ అవార్డుని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకుంది. ఆ అవార్డు ఇస్తూనే అరవింద్ మృణాల్‌ తో '' గతంలో ఓ వేదిక పై ఓ హీరోయిన్‌ తో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని తెలుగు ఇండస్ట్రీకి కోడలుగా రమ్మని అన్నాను. ఇప్పుడు ఆ నటి ఆ మాటను నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా..టాలీవుడ్‌ కోడలిగా హైదరాబాద్‌ వచ్చేయ్‌'' అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

దానికి మృణాల్ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండిపోవడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే అల్లు అరవింద్‌ మాటల్ని మృణాల్‌ కూడా నిజం చేస్తుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు