Alla Nani : జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం! వైసీపీకి మరో దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం . . ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు . By KVD Varma 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Alla Nani Resigned To YCP : వైసీపీ (YCP) అన్ని పదవులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని (Alla Nani) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . ఈమేరకు ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఆళ్ళ నాని వ్యవహరిస్తున్నారు. ఆళ్లనాని జగన్ (YS Jagan) కు రాసిన లేఖలో పలు అంశాలు ప్రస్తావించినట్టు సమాచారం . వ్యక్తిగత కారణాలతో భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు వెల్లడించిన ఆళ్లనాని . సాధారణంగా ఆళ్ల నానిగా చెప్పుకునే ఈయన పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. ఈయన 2004 - 2013 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఏలూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ్యునిగా ఉన్నారు . కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్సీ అయ్యారు . ఆ తరువాత మళ్లీ ఏలూరు నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి , YSRCP నుంచి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా , ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు . ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు . తరువాత ఆయన ఏలూరు జిల్లాకు వైసీపీ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు . ఈ మధ్య చాలాకాలంగా ఆయన పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది . ఇప్పటికే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో . . ఆళ్లనాని వైసీపీని వీడుతున్నారంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ రాజీనామా లేఖను జగన్ కు పంపించారు ఆళ్లనాని . ఇప్పటికే ఒక్కొక్కరుగా కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు . నిన్నటికి నిన్న పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబు పార్టీని విడి జనసేనలో చేరిపోయారు. అధికారం కోల్పోవడమే కాకుండా . . కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు . దీంతో చాలా మంది నాయకులు బహిరంగంగానే పార్టీని . . అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు. Also Read : గురుకుల స్కూల్‌లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది? #andhra-pradesh #ap-ycp #alla-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి