Cloves Benefits : లవంగాలని పోషకాల పవర్‌హౌజ్ అని అని అంటారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటంటే..
లవంగాలు(Cloves) తినడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇది బరువు తగ్గడానికి(Weight Loss) బాగా హెల్ప్ చేస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, లవంగాలని తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలు దూరమవుతాయి.
లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సాయపడుతుంది.
లవంగాలు బ్లడ్‌ని ప్యూరిఫై(Blood Purify) చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన రక్తాన్ని క్లీన్, హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి.లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్స్‌తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి. లవంగాల్లోని ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సాయపడతాయి.
కడుపులో అల్సర్(Ulcer) తో బాధపడేవారికి కూడా లవంగాలు తీసుకోవడం మంచిది. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పెప్టిక్ అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. ఇది నొప్పి, వాపు నుండి రిలీఫ్‌నిస్తాయి.
Also Read : మీలో ఈ సంకేతాలు గుండెపోటుకు కారణం కావచ్చు.. ఎప్పుడైనా ఇలా అనిపిస్తే నెగ్లెట్ చేయొద్దు