ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను చూసేందుకు దేశవ్యా్ప్తంగా ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే చాలామంది భక్తులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు అధికారులు కూడా అయోధ్యకు వచ్చేవారి కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఉండే హోటళ్ల బుకింగ్స్ కూడా దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అయితే హోటల్ రూమ్ బుకింగ్స్ ధరలు గతంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా పెరగడాన్ని చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు.
అయోధ్యలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రానున్న నేపథ్యంలో హోటల్ యజమానులు పెంచిన రూమ్ రెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని లగ్జరీ హోటళ్లలో కేవలం ఒక్కరోజుకి మాత్రమే లక్ష రూపాయలకు వరకు చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రామ్‌లల్లా ఉత్సవం కోసం ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా దాదాపు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇక హోటల్ అయోధ్య ప్యాలెస్‌లో ప్రస్తుతం రోజువారీ రూమ్ రెంట్ రూ.18,500గా ఉంది. సాధారణంగా అక్కడ రూం రెంట్ కేవలం రూ.3700 మాత్రమే.
Also Read: వైఎస్ షర్మిలా ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుంచే..
ది రామాయణ హోటల్ చూసుకుంటే అక్కడ ప్రస్తతం రోజువారి రూమ్ రెంటు రూ.40 వేలు పలుకుతోంది. 2023లో దీని అద్దె రూ.14,900 మాత్రమే ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ అనే హోటల్‌లో అయితే ఒక్కరోజు అద్దె ఏకంగా రూ.70,500గా ఉంది. గత ఏడాది జనవరి అక్కడ రెంట్ రూ.16,800గా ఉండేది. అయోధ్యలోని రామాయణ్ హోటల్‌లో గదుల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ హోటల్‌లోని రూమ్స్ జనవరి 20 నుంచి 23 వరకు బుకింగ్స్ జరిగాయి.
ఈ హోటల్‌లో రూం రెంట్ రోజుకు రూ.10 వేల నుంచి 25 వేల వరకు అమాంతం పెరిగిపోయింది. ఇక రానున్న రోజుల్లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్‌లోని ఓ లగ్జరీ రూమ్ ఒక్కరోజు అద్దె ధర ఏకంగా లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. అంతేకాదు ఈ హోటల్‌లోని గదులన్నీ కూడా బుక్ అయినట్లు హోటల్ అయినట్లు హోటల్ యజమాన్యం తెలిపింది. అయితే గతంలో ఈ హోటల్ రూమ్ రెంట్ కేవలం రూ.7,500గా ఉండేది.
Also Read: తల్లి అయిన 9వ తరగతి బాలిక.. 2.2కేజీల శిశువు జననం