Telangana Elections: ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన హామీ..

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి పోటీచేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌ తనను గెలిస్తే రూపాయికే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. అలాగే రూపాయికే ఉచిత విద్య, వైద్యం, న్యాయ సలహాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

New Update
మార్చి నెల మొదటి రోజే ఎల్పీజీ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్ ధరలు!

తెలంగాణలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు, హామీలతో దూసుకుపోతున్నాయి. మొన్నటి వరకు నామినేషన్ల పర్వం జరిగి నిన్నటితో ఈ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల జాతర సందడి నెలకొంది. ఓవైపు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించగా.. మరోవైపు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీల హామీని ప్రకటించింది. ఇక త్వరలోనే బీజేపీ మేనిఫెస్టో కూడా రానుంది.

Also Read: సినీ ఇండస్ట్రీలో విషాదం.. చంద్రమోహన్ ఇకలేరు

అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.400లకే సిలిండర్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో పార్టీ అభ్యర్థి కూడా గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన చేశారు. నన్ను గెలిపిస్తే.. ఏడాదికి కేవలం రూ.1కే నాలుగు సిలిండర్లు ఇస్తానని సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం.. అలాగే రూపాయికే న్యాయ సలహాలిస్తానని అంటున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని.. 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారాలు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా!

Advertisment
తాజా కథనాలు