Baltimore Bridge Accident: అమెరికా బాల్టిమోర్‌లోని వంతెనను కార్గో షిప్ (Cargo Ship) ఢీకొన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో ఉన్న 22 మంది భారతీయులేనని (Indians) సినర్జీ మెరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇద్దరు పైలట్‌లతో సహా అందులోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పలు నివేదికలు వెల్లడించాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన (Francis Scott Key Bridge) కుప్ప కూలిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్.. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు (Joe Biden) ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది?
ఈ సంఘటన తెల్లవారుజామున 1:30 గంటలకు నదిని దాటుతుండగా వంతెన పైలాన్‌ను ఢీకొట్టింది. దీంతో వంతెన కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఉగ్రవాదుల ప్రమేయం లేదని అధికారులు తేల్చి చెప్పారు. వంతెన కూలిపోవడంతో పాటు ఓడలో మంటలు చెలరేగడంతో దానిపై వాహనాల హెడ్‌లైట్లు వెలుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాల్టిమోర్ అధికారులు కనీసం ఏడు వాహనాలు నదిలోకి పడిపోయాయని, తక్షణ సహాయక చర్యలను ప్రారంభించామని చెప్పారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 20 మంది వ్యక్తులు గల్లంతు అయినట్లు తెలిపారు.
అతిపెద్ద పోర్ట్..
ఇక US ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం కంటైనర్ షిప్ ఓడరేవు నుంచి బయలుదేరినప్పుడు చోదక శక్తిని కోల్పోయినట్లు తెలుస్తోంది. బ్రిడ్జిని ఢీకొట్టేముందు నియంత్రణ కోల్పోయిందని, దీంతో సిబ్బంది మేరీల్యాండ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఇక ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ COWIfonden చైర్ ఆఫ్ డేవిడ్ మెకెంజీ ప్రకారం.. 1970ల నాటి బ్రిడ్జ్ ను పునర్నిర్మించడానికి అప్పటికంటే 10 రెట్లు $60 మిలియన్ల ఖర్చు అవుతుందన్నారు. ఇక మేరీల్యాండ్ పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. బాల్టిమోర్ కంటెయినర్ హ్యాండ్లింగ్ పరంగా USలో పదకొండవ అతిపెద్ద పోర్ట్. అయితే కార్ల ఎగుమతుల కోసం అత్యంత రద్దీగా ఉండే US పోర్ట్ 2023లో 750,000 వాహనాలను వివిధ ప్రాంతాలకు చేరవేసింది. బొగ్గు ఎగుమతులలో ఇది రెండో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు. గత సంవత్సరం 444,000 మంది ప్రయాణికులు పోర్ట్ మార్గంలో ప్రయాణించారని తెలిపారు.
Also Read: Airtel, Jio కస్టమర్లకు షాక్.. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?