Video Viral : అమెరికాలో మళ్లీ గ్రహాంతరవాసుల కలకలం

గతంలో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఫ్లైయింగ్‌ సాసర్లు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆకాశంలో వింత వింత ఆకారాలు కనిపించాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు కాలిఫోర్నియాలో గ్రహాంతర వాసులు కనిపించారనే ప్రచారం కలకలం సృష్టించింది. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Video Viral : అమెరికాలో మళ్లీ గ్రహాంతరవాసుల కలకలం
New Update

Aliens : గతంలో అమెరికా(America) లోని చాలా ప్రాంతాల్లో ఫ్లైయింగ్‌ సాసర్లు(Flying Saucer) కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రహాంతరవాసులు(Aliens) భూమిపైకి వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు కాలిఫోర్నియాలో గ్రహాంతర వాసులు కనిపించారనే ప్రచారం కలకలం సృష్టించింది.

కాలిఫోర్నియా స్కైస్ పై హ్యూమనోయిడ్‌లా కనిపించే గుర్తు తెలియని వస్తువును కొందరు గమనించి వీడియో తీశారు. సోషల్‌ మీడియా(Social Media) లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆకాశంలో వింత వింత ఆకారాలు కనిపించాయి. అవి గ్రహాంతర వాసులే అని కొందరు చెబుతున్నారు. వీడియో పోస్ట్‌ చేసినప్పటి నుంచి మిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయి.

Alien unrest in America again

ఒక మనిషి ఆకారం కదిలినట్టు ఉందని వీడియో చూసిన వారు చెబుతున్నారు. అయితే ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తే నిజమైన గ్రహాంతర వాసులేమోన్న అనుమానం కలుగుతోందని నిపుణులు అంటున్నారు. ఇదే తరహా వీడియో ఏడేళ్ల క్రితం నవంబర్ 2016లో చిత్రీకరించబడింది. ఇది నిజానికి జేసీ ఏరియల్ అనే ఛానెల్ ద్వారా YouTube లో పోస్ట్‌ చేశారు. ఇది హోలోగ్రామ్‌ టెక్నాలజీతో సృష్టించిందని అంటున్నారు. పాత వీడియోనే ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఫ్యాక్టరీలో నెయిల్‌ పాలిష్‌ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#video-viral #america #aliens
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe