/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Alien-unrest-in-America-again-jpg.webp)
Aliens : గతంలో అమెరికా(America) లోని చాలా ప్రాంతాల్లో ఫ్లైయింగ్ సాసర్లు(Flying Saucer) కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రహాంతరవాసులు(Aliens) భూమిపైకి వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు కాలిఫోర్నియాలో గ్రహాంతర వాసులు కనిపించారనే ప్రచారం కలకలం సృష్టించింది.
Esto se está volviendo viral:
Diversas cuentas en X muestran este video, aseguran que se formó esta imagen el cielo de Sequoia Park, California.
————————————
Ya que llegaste aquí , sígueme y lee el resto de las noticias de mi página para estar informad@ las 24 horas. pic.twitter.com/yHQm7GvMan
— Ruben Lobo Lopez (@ReubenLoboLopez) April 15, 2024
కాలిఫోర్నియా స్కైస్ పై హ్యూమనోయిడ్‌లా కనిపించే గుర్తు తెలియని వస్తువును కొందరు గమనించి వీడియో తీశారు. సోషల్ మీడియా(Social Media) లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆకాశంలో వింత వింత ఆకారాలు కనిపించాయి. అవి గ్రహాంతర వాసులే అని కొందరు చెబుతున్నారు. వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.
ఒక మనిషి ఆకారం కదిలినట్టు ఉందని వీడియో చూసిన వారు చెబుతున్నారు. అయితే ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తే నిజమైన గ్రహాంతర వాసులేమోన్న అనుమానం కలుగుతోందని నిపుణులు అంటున్నారు. ఇదే తరహా వీడియో ఏడేళ్ల క్రితం నవంబర్ 2016లో చిత్రీకరించబడింది. ఇది నిజానికి జేసీ ఏరియల్ అనే ఛానెల్ ద్వారా YouTube లో పోస్ట్ చేశారు. ఇది హోలోగ్రామ్ టెక్నాలజీతో సృష్టించిందని అంటున్నారు. పాత వీడియోనే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఫ్యాక్టరీలో నెయిల్ పాలిష్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.