Alia Bhatt: టైమ్స్‌ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు!

ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్‌ తో పాటు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల,భారత రెజ్లర్ సాక్షి మాలిక్‌ ఉన్నారు.

New Update
Alia Bhatt: టైమ్స్‌ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు!

ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్‌ తో పాటు మైక్సోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో పాటు భారత రెజ్లర్ సాక్షి మాలిక్‌, ప్రముఖ నటుడు దేవ్‌ పటేల్‌ తో పాటు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగా కూడా ఉన్నారు.

భారత్‌కు చెందిన పలువురు మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోాగాలను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఎదుర్కొన్నారు. ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవి నుంచి తప్పించాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన స్టార్ రెజర్లలో సాక్షి మాలిక్ ఒకరు.

వీరితో పాటు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన లోన్ ప్రోగ్రామ్స్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా, ఖగోళ శాస్త్ర నిపుణులు, ఫిజిక్స్ ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, బ్రిటన్‌లో రెస్టారెంట్లు నిర్వహించే భారత సంతతి మహిళ అస్మా ఖాన్‌లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

రష్యాలో అనుమానాస్పద స్థితిలో జైలులో చనిపోయిన ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ భార్య యులియా నవల్నాయ పేరును సైతం ఈ జాబితాలో చేర్చడం విశేషం.

Also read: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు