మరో డీప్ ఫేక్ వీడియో ఫిల్మ్ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే రష్మిక మందన్నా, బాలీవుడ్ నటి కాజోల్ లా ఫేక్ వీడియోస్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ నటి అలియా భట్ కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలోకంటే ఈసారి మరిత అసభ్యంగా ఉన్న వీడియోను ఆకతాయిలు నెట్టింట షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు షాక్ అవుతున్నారు. మరి ఇంతదారుణంగా దిగజారిపోయారంటూ ఇందుకు పాల్పడిన వ్యక్తులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. బెడ్ రూమ్ లో స్లీవ్ లెస్ నైట్ డ్రెస్ ధరించిన ఓ యువతి కాస్త బోల్డ్ యాంగిల్స్ లో రీల్స్ చేసింది. బెడ్ పై కూర్చొని శృంగార భంగిమలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. అంతటితో ఆగకుండా బాటమ్ ప్రైవేట్ పార్ట్ హైలెట్ చేస్తూ మరింత రెచ్చిపోయిన వీడియోను నెట్టింట షేర్ చేసింది. అయితే ఈ వీడియో వైరల్ అవుతుండగా సోషల్ మీడియా అపరిచితులు ఆ అమ్మాయి ఫేస్‌కు అలియా ఫొటోను జతచేసిన రీపోస్ట్ చేశారు. ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఆ బాడీకి సరిపోలే విధంగా అలియా ఫేస్ క్రియేట్ చేశారు. అనుకోకుండా చూసిన నెటిన్లకు అలియాదే అనే అనుమానం వచ్చేలా ముఖాన్ని అతికించారు ఆకతాయిలు. అయితే వైరల్ అవుతున్న వీడియోపై స్పందిస్తున్న కొంతమంది రణ్ బీర్ ను ఉద్దేశిస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది చూడగానే తెలిసిపోతుంది ఇది ఫేక్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలియాకు మద్దతుగా నిలుస్తూ సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also resad : నువ్వు తప్పు చేస్తున్నావు.. స్టార్ నిర్మాతకు సముద్రఖని సీరియస్ వార్నింగ్
ఇక ఈ వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై అలియా భట్ ఎలా స్పందింస్తుందో చూడాలి. ఇక రష్మిక, కాజోల్ ఘటన జరిగిన తర్వాత మార్ఫింగ్ వీడియోల పోస్టింగ్ కట్టడి కాలేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. గతంలోనూ కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కాజోల్, సారా టెండూల్కర్లు దీని బారిన పడ్డారు.