School Holidays for 3 Days: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. పాఠశాలలకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రాబోతున్నాయి ఎప్పుడెప్పుడు సెలవులు రాబోతున్నాయో తెలుసుకుందాం.
విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు హాలిడేస్ వస్తున్నాయి.మార్చి 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇ తర్వాత రోజు అంటే మార్చి 9వ తేదీ రెండు శనివారం కావడంతో కొన్ని విద్యాసంస్థలకు ఆరోజు హాలీడే ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆదివారం...ఎలాగో విద్యా సంస్థలు పనిచేయవన్న సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులకు వరుసగా మూడురోజులపాటు సెలవులు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య
మార్చినెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవులు భారీగానే ఉండునున్నట్లు తెలుస్తోంది. ముందుగా మార్చి 3వ తేదీన ఆదివారం కావడంతో అందరికీ సెలవు. దీని తర్వాత వచ్చే శివరాత్రికి వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చి 17,24వ తేదీల్లో ఆదివారాలు వస్తున్నాయి. 25వ తేదీన హోలీ పండగ ఉంది. మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.ఇక మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడ్ ఉంది. ఆరోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. మార్చి 31న ఆదివారం . ఇలా మార్చి నెలలో మొత్తం 11రోజులు సెలవులు వచ్చాయి. ఆరు ప్రభుత్వ సెలవులతోపాటు ఐదురోజులు ఆదివారాలు వచ్చాయి. బోర్డు పరీక్షలు కొనసాగుతున్నందున స్కూళ్లు సరిగ్గా పనిచేయడం లేదు.