Jobs : నిరుద్యోగులకు అలర్ట్...ఈ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు అప్లయ్ చేశారా?

ఇటీవల ప్రభుత్వ రంగం సంస్థలు పలు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, క్లర్క్, గ్రూప్ 2, స్టాఫ్ నర్సు వంటి పోస్టులను భర్తీ చేసేందుకు పలు సంస్థలు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నాయి.

New Update
Central Govt Jobs: నిరుద్యోగులకు భారీ న్యూ ఇయర్ కానుక.. 27,370 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Job Recruitment : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలు పలు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్స్(Job Recruitment) విడుదల చేశాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్, జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, క్లర్క్,గ్రూప్ 2,స్టాఫ్ నర్సు వంటి పోస్టులను భర్తీ చేసేందుకు పలు సంస్థలు రిక్రూట్ మెట్ నిర్వహిస్తున్నాయి. అయితే వీటిలో ఈ వారం దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులోఉన్న నోటిఫికేషన్స్ ఏవో చూద్దాం.

ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షురూ కానుంది. ఈ గడువు 2024 జనవరి 10వ తేదీని ముగుస్తుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా డిగ్రీపూర్తి చేసి ఊండాలి. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది.

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం డిపార్ట్ మెంటల్ రిక్రూట్ మెంట్ చేపడుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్లో డిసెండర్ 23లోపు దరఖాస్తులు సమర్పించాలి. అప్లికేషన్స్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కనీసం 3ఏళ్లు సర్వీస్ తో సీసీఎల్ లో శాశ్వత ఉద్యోగాలు అయి ఉండాలి. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ప్రస్తుతానికి 109 ఖాళీల భర్తీ కానున్నాయి.

క్లర్క్ పోస్టుల భర్తీకి వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ wbpsc.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 8నుంచి ప్రారంభమైంది. ఈ గడువు డిసెంబర్ 29న ముగించనుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ స్కిల్స్ పై అవగాహన ఉండాలి.

హర్యానా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేటెస్టుగా అప్లికేషన్ ప్రాసెస్ ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ hpsc.gov.in ద్వారా డిసెంబర్ 21వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుగా రూ. 1000చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 121 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో డీఎస్పీ, నాయబ్ తహసీల్దార్, ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ ఆఫీసర్, ట్రాఫిక్ మేనేజర్, బ్లాక్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఇక స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి యూపీపీఎస్సీ తాజాగా రిక్రూట్ మెంట్ ను చేపడుతోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ uppsc.up.nic.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయ్యింది. 2024 జనవరి 1 తో ఈ గడువు ముగుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయనుంది. అందులో స్టాఫ్ నర్సు యునాని 2 పోస్టులు, మిగతా 25 పోస్టులు ఫిమేల్ యునాని అభ్యర్థుల నుంచి భర్తీ చేస్తారు. దరఖాస్తుదారులు ఇంటర్ లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా స్టాఫ్ నర్స్ రిక్రూట్ మెంట్ కోసం ప్రభుత్వం గుర్తించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఇది కూడా చదవండి: 5 రోజులు దంచికొట్టనున్న వానలు? దూసుకోస్తున్న మరో తుఫాన్ ?

Advertisment
Advertisment
తాజా కథనాలు