రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ నేపథ్యంలో రైల్వే స్పెషల్ ట్రైన్స్..!!

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడుతోపాటు ఏపీని వణికిస్తోంది. తీరం వైపు దూసుకొస్తోంది. తెలంగాణపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలోని పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను కేటాయించింది. హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసింది.

Indian Railways: ఈరోజు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్..
New Update

ఏపీలోని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిచౌంగ్ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో మంగినపూడి బీచ్ లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. 100మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చినట్లు చెప్పారు. దీంతో సముద్ర తీరానికి రాకపోకలు నిలిపివేశారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద తో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుని...ఏకంగా 151 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.

కాగా సైక్లోన్ మిచౌంగ్ ఎఫెక్ట్ దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకోసం కోసం ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసింది. #CycloneMichuang దృష్ట్యా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌లు ఏర్పాటు చేసింది. సికింద్ర బాద్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్ & హైదరాబాద్ డివిన్స్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేసింది.రైలు సమాచారంపై తాజా అప్‌డేట్‌ల కోసం ప్రయాణికులు ఈ సేవల సేవలను avbl ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

అటు ఈ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్‌పేట్, పంజాగట్ట, మెహిదీపట్నం, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.ఇక రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. అలాగే సూర్యపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కరుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించింది. అలాగే వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిక నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. అలాగే ఈ తుపాను ధాటికి తమిళనాడులో చైన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

ఇది కూడా చదవండి: మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!!

#special-trains #railway-helpline-numbers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe