పదోతరగతి పబ్లిక్ పరీక్షల గురించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్క్రుతం పేపర్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడంపై విమర్శలు తలెత్తడంతో సర్కార్ వెనకడుగు వేసింది. వచ్చే ఏడాది నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సాంస్క్రుతం 30 మార్కులు ఉంటుంది. ఇదే విధానాన్ని ఉర్దూ, హిందీ, ఉర్దూ అరబిక్, ఉర్దూ పార్శి పేపర్లకు కూడా అమలు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!!
ఈఏడాది ఏడు పేపర్లు:
ఇక ఈ ఏడాది పదోతరగత పరీక్షల్లో ఏడు పేపర్లు ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భౌతిక, రసాయశాస్త్రాలు కలిపి ఒక పేపర్ గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్ గా ఉండనుంది. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. రెండింటింలోనూ 17 చొప్పున మార్కులు ఉండనున్నాయి. రెండింటింలో కలిపి 35మార్కులు సాధిస్తే ఉత్తీర్ణ సాధించినట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ పేపర్లు యాథావిధిగా ఉండనున్నాయి. తెలుగు, హిందీలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అతున్నారంటూ ప్రశ్నపత్రం విధానంలోనూ మార్పులు చేశారు.
ఆ ప్రశ్నలు తొలగింపు:
తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటివరకు ఉన్న ప్రతిపదార్థాలకు భావం రాసే ప్రశ్నలకు తొలగించాలరు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. పద్యంపై 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోప్రశ్నకు 2 చొప్పున మొత్తం 8 మార్కులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!!
రెండో ప్రశ్నగా ఇప్పవరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8మార్కులు ఉండేవి. ఇప్పుడు గద్యాన్ని చదివి 4 ప్రశ్నలకు జవాబులు రాయాలి. దీనికి ఒక్కో మార్కుకు రెండు మార్కులు ఉంటాయి. హిందీలో విద్యార్థులు ఈజీగా పాస్ అయ్యే విధంగా క్వచ్చన్ పేపర్ ను మార్చారు. గతంలో ఉన్న బిట్ పేపర్ ను తొలగించారు. ఇప్పుడు అదే విధానాన్ని తీసుకువచ్చారు. 14 మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.